NewsOrbit
న్యూస్

Karthika Deepam : సౌందర్యతో కలిసి దీప, కార్తీక్, లు ఇంటికి వెళ్ళానున్నారా… మరి రుద్రాణి పరిస్థితి ఏంటో..?

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ భలే ఆసక్తి కరంగా ముందుకు సాగుతూ వెళ్తుంది.సౌందర్య రాకతో కధలో కీలక మార్పు చోటు చేసుకుంది. రుద్రాణి కట్టాలిసిన బాకీతో పాటు పది లక్షల చెక్ ముఖాన పడేసిద్ధి సౌందర్య.ఇంకా అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఈ క్రమంలోనే కార్తీక్‌ని ‘మనం హైదరాబాద్ వెళ్లిపోదాంరా పెద్దోడా’ అంటే కార్తీక్ మాత్రం రాను అంటాడు.దాంతో సౌందర్య పంతంగా మీకేనా పంతాలు ఉండేది. నేను మీ అమ్మనిరా.. నేను మీ డాడీ ఇద్దరం కూడా ఇలానే ఎక్కడికైనా వెళ్లిపోతాం.. అంటుండగానే.. దీప, కార్తీక్ అలా మాట్లాడొద్దని సరే వస్తాం అంటారు.ఇక సీన్ కట్ చేస్తే మోనిత, భారతి ఒక హోటల్‌లో దిగుతారు. ‘ఏంటి భారతి నా పరిస్థితి అంటూ బాధలు చెప్పుకుంటూ ఉంటే భారతి కూల్‌గా బుక్ చదువుకుంటూ ‘మోనితా నీ కష్టాలు కొత్తేం కాదు. అసలు అవి కష్టాలే కాదు.. కోరి తెచ్చుకున్నవి..’ అంటుంది భారతి.

Karthika Deepam : మోనిత బిడ్డ కోసం పడే తపన మాములుగా లేదుగా.?

Karthika Deepam

తప్పు ఒప్పులు పక్కన పెట్టి ఎన్నోసార్లు హెల్ప్ చేస్తూనే ఉన్నాగా..’ అంటుంది భారతి. ‘అది కాదు భారతి.. అసలు అసలు కార్తీక్ సంగతి పక్కన పెడితే,నా కొడుకు ఏం చేస్తున్నాడో కదా..? ఎక్కడున్నాడో ఏంటో?’ అంటూ ఏడుస్తుంది. దాంతో భారతి ఓదారుస్తుంది.ఇక హిమ జరిగిది తలుచుకుని ఏడుస్తు ‘నాన్నమ్మ రాకుంటే నేను తిరిగి వస్తాను అనుకోలేదు తెలుసా’అంటూ హిమ చాలా ఏడుస్తుంది. తర్వాత సౌర్య.. ‘ఏడవకు హిమ.. మనం ఇక ఇక్కడ ఉండములే.. నాన్నమ్మ నాన్నని ఒప్పిస్తుంది. మనం హైదరాబాద్ వెళ్లిపోతాం అంటుంది.ఆనంద్, దీపగాడు కలిసే పెరుగుతారు.. కలిసే ఆడుకుంటారు బాగుంటుంది’ అంటూ కబుర్లు చెప్పి హిమని ఏడవకుండా ఆపుతుంది.

Karthika Deepam : కార్తీక్, దీపల పెళ్లి ఫోటో చూసి మురిసిపోయిన సౌర్య, హిమలు

Karthika Deepam

కాసేపటికి సౌందర్య కొన్ని బుక్స్ ఒడిలో పెట్టుకుని చూస్తూ ఉంటుంది. ఎంటివి అని అడిగితే మీరు వచ్చేశాక వీటినే మీ జ్ఞాపకాలుగా చూసుకుని ఏడ్చేదాన్ని తెలుసా’‘సరే వీటిని కూడా బ్యాగ్‌లో పెట్టేసుకోండి’ అంటూ సౌర్యకు ఇస్తుంది. అప్పుడే అందులోంచి ఓ పర్స్ బయటికి వస్తుంది. ‘నాన్నమ్మా ఈ పర్స్ ఎవరిది?’ అంటే.. మీ నాన్నది అంటూ అందులోని దీప, కార్తీక్‌ల పెళ్లి ఫొటో చూసి మురిసిపోతుంది.అలాగే ఆ పర్స్ లోని డబ్బులు చూసిన హిమ ‘అమ్మో ఇంత డబ్బా.. ఈ మధ్యకాలంలో చూడలేదు’ అంటుంది. ‘అంతా మీ నాన్నదే అది.. వచ్చేప్పుడు పర్స్ ఇంట్లో మరిచిపోయి వచ్చేశాడు మీ నాన్న’ అంటూ ‘పెద్దోడా అవి ఎలాగో నీ డబ్బే కదా వాటితో దీప బంగారం విడిపించరా’ అంటుంది.

దీప బంగారం విడిపించిన కార్తీక్… ఆనందంలో దీప :

Karthika Deepam
ఇంతలో హిమ లేచి.. ‘డాడీ రెస్టారెంట్‌లో తిందామా? చాలా డబ్బు ఉంది..’ అంటుంది. ప్లీజ్ నాన్నా’ అంటుంది సౌర్య. కార్తీక్ సరేనంటాడు.ఇక భారతి ఇబ్బంది పడుతూ తన భర్త రవితో ‘వచ్చేస్తాం అనుకోకుండా ఆగాల్సి వచ్చింది రవి’ అంటూ ఉంటుంది. అదివిన్న మోనిత ‘నా కారణంగా భారతి ఇబ్బంది పడతోంది అనుకుని భారతి మనం వెళ్లిపోదాం.తరువాత కార్తీక్‌ని వెతికిస్తానులే’ అంటూ బయలుదేరదాం అంటుంది.ఇక డాక్టర్ బాబు కర్చిఫ్‌లో కట్టిన బంగారన్నా దీప ముందు ఉంచుతాడు. వాటిని చూసి దీప మురిసిపోతుంది.

కాళ్లబెరానికి వచ్చిన రుద్రాణి:

ఇక హిమ బాబుని ఎత్తుకుని వస్తుంది. సౌందర్య సౌర్యని తీసుకుని వస్తుంది. ఎరా బాబుని ఆ శ్రీవల్లి, కోటేష్‌లు ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారో ఏమైనా సమాచారం తెలిసిందా?’ అంటుంది సౌందర్య. లేదు మమ్మీ అంటాడు కార్తీక్. ఇంతలో రుద్రాణి.. తన రౌడీలతో కలిసి వస్తుంది. ‘ఎక్కడికో బయలుదేరుతున్నట్లు ఉన్నారు’ అంటుంది రుద్రాణి. ‘మేము హైదరాబాద్ వెళ్తున్నాం అంటుంది దీప. ‘మీపాటికి మీరు వచ్చి చెక్ రాసి ముఖాన్న కొట్టిపోతే ఎలా మేడమ్ అని‘ఈ చెక్ నాకు వద్దు మేడమ్ అంటూ దన్నం పెట్టి మరీ ‘నన్ను క్షమించండి డాక్టర్ గారు. అమ్మా దీపమ్మా నన్ను మన్నించండి అమ్మా… పిల్లలంటే ఇష్టం,డబ్బు అధికారం అంటే పిచ్చితో మిమ్మల్ని ఎన్నో కష్టాలు పెట్టాను అంటూ క్షమాపణలు చెబుతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju