న్యూస్ సినిమా

Karthika Deepam : ఏంటి కార్తీక్ ఇది..నీ తల్లి తండ్రులను ఇంత బాధపెట్టడం న్యాయమా..?

karthika deepam
Share

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు. తిరుగుతూ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ వెళుతుంది. ఎట్టకేలకే అందరు కూడా తాడికొండ గ్రామానికే చేరుకున్నారు. కానీ ఒకర్ని ఒకరి చూసుకోరు. మోనిత మాత్రం కాసేపు ఊరంతా వెతికి తిరిగి వెళ్ళిపోతుంది. కార్తీక్ మోనితను చుసిన విషయం దీపకు చెబితే ఇకమీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతుంది. మరో పక్క ఆనందరావు, సౌందర్య దంపతులు ప్రకృతి వైద్యశాలలో చికిత్స కోసం తాడికొండలో ఆశ్రమానికి వస్తారు.. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరగనుంది అంటే దీప రుద్రాణి బారినుంచి పిల్లల్ని ఎలా రక్షించాలా అనే ఆలోచనలో పడుతుంది.. అప్పు తీర్చాలి అని చూస్తుంటే తీర్చకపోవడమే మంచిదని రుద్రాణి ఆలోచిస్తోంది…నా పిల్లలపై కన్నేసింది అని బాధపడుతుంది.

Karthika Deepam : కార్తీక్ ఏంటి పాపం భోజనం పార్సిల్స్ తీసుకెళ్తున్నాడు,?

karthika deepam

సీన్ కట్ చేస్తే హోటల్లో పని చేస్తున్న కార్తీక్ కు అప్పారావు రెండు పార్సిల్స్ ఇచ్చి ఒకటి ప్రకృతి ఆశ్రమానికి మరొకటి రుద్రాణికి ఇచ్చిరావాలని చెబుతాడు. అలాగే ఇండస్ట్రీలో నిర్మాతతోను,తాడికొండలో రుద్రాణితో మంచిగా ఉండాలని సలహా కూడా ఇస్తాడు. రుద్రాణి డబ్బులిస్తే తీసుకో లేదంటే వదిలెయ్ అని అప్పారావు చెబుతాడు. కార్తీక్ పార్సిల్స్ తీసుకుని బయటకు వెళ్ళగానే హోటల్లోకి దీప ఎంట్రీ ఇస్తుంది.ఇద్దరు ఒకర్ని ఒకరు చూసుకోరు.

Karthika Deepam: ప్రకృతి ఆశ్రమంలో కార్తీక్ తన తల్లి తండ్రులను చూసాడా?

karthika deepam
karthika deepam

మరోపక్క మోనిత ప్రేమ కథ అంతా విన్న పనిమనిషి ఏడుస్తుంటే కశ్చీఫ్ ఇస్తుంది మోనిత.మీ కధలో ఇన్ని మలుపులా అని మీ లవ్ స్టోరీ నంబర్ వన్ లవ్ స్టోరీ అంటుంది.విన్నికి థాంక్స్ చెప్పిన మోనిత ఎప్పటికైనా నా కార్తీక్ ని చేరుకుంటాను అంటుంది. ఇంతలో ప్రకృతి వైద్యశాలలో రూమ్ లో కూర్చున్న ఆనందరావు, సౌందర్య మాట్లాడుకుంటూ వెళ్లి గోరువెచ్చని నీళ్లు తీసుకొస్తా అంటుంది సౌందర్య.ప్రకృతి ఆశ్రమానికి భోజనం తెచ్చిన కార్తీక్ లోపలకు వెళ్లి కార్తీక్ ఎవరో భోజనం ఆర్డర్ చేశారని అడుగుతాడు..కొత్తగా వచ్చిన వాళ్లే అయి ఉంటారన్న అక్కడ పనిచేసే వ్యక్తి సౌందర్య-ఆనందరావు ఉన్న రూమ్ చూపిస్తాడు. రూమ్ లోకి వెళ్లిన కార్తీక్ మంచంపై నిద్రపోతున్న తన తండ్రిని చూసి అవాక్ అవుతాడు.

కార్తీక్ గురించి బాధ పడుతున్న ఆనందారావు, సౌందర్య

karthika deepam
ఆస్థి అంతస్థు ఉన్నాగాని ఏమీలేనట్టు ఇక్కడ చేరారా అని బాధపడతాడు. సౌందర్య రావడం చూసి వాళ్ళకి కనిపించకుండా తలుపు చాటున దాక్కుంటాడు. టేబుల్ పై భోజనం పార్సిల్ చూసిన సౌందర్య ఆనందరావుని నిద్రలేపుతుంది. దిక్కులేని వాళ్లలా ఇక్కడ చేరితే నా తల్లి దండ్రులకు నేను భోజనం తీసుకొచ్చానా అనుకుంటాడు కార్తీక్. మరోవైపు భోజనం చేయను ఆకలిగా లేదు అంటాడు ఆనందరావు.భోజనం చేస్తుంటే నాకు పెద్దోడే గుర్తొస్తున్నాడు అని బాధపడతాడు.నోట్లో ముద్ద పెట్టుకుంటుంటే నా కొడుకు తిన్నాడో లేదో, నా మనవరాళ్లు, కోడలు తిన్నారో లేదో అనిపిస్తోంది.ఏంటి సౌందర్య మన జీవితాలు ఇలా అయిపోయాయి.పెద్దోడు వెళ్తే వెళ్ళాడు కానీ నాకిక్కడ ఉండాలని అనిపించడం లేదు కొన్నాళ్లు ఎక్కడికైనా వెళ్లొస్తానని చెప్పి ఉంటే ఇంత బాధపడేవాడిని కాదంటాడు.

కనీసం నేను చస్తే తలకోరువు అన్నా పెడతాడా అనే అనుమానంలో ఆనందారావు?

karthika deepam

ఆనందరావు మాటలు విన్న సౌందర్య. మీరు బాధపడకండి కార్తీక్ మనల్ని వెతుక్కుంటూ వస్తాడని చెబుతుంది. నాకు ఆ నమ్మకం లేదు సౌందర్య.ఏధైనా జరగరానిది జరిగి ఒకవేళ నా ప్రాణాలు పోతే నాకు చివరి కర్మలకైనా వస్తాడో లేదో అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.వాళ్ళని చూసి కార్తీక్ గుండె తరుక్కుమంటుంది.గుండె నిండా భారంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క రుద్రాణి పంపిన క్యారియర్ స్కూల్ కి తీసుకోచ్చి ఈరోజు ఎలాగయినా పిల్లలతో భోజనం తినిపించాలని అనుకుంటారు రుద్రాణి రౌడీలు.వాళ్ళు తెచ్చిన ఆ క్యారియర్ తీసుకున్న హిమ, శౌర్యలు తెలివిగా స్కూల్లో పిల్లలందరకీ ఆ భోజనం పెట్టేసి, రుద్రాణి మనుషులకు కనపడకుండా ఇంటికి వెళ్లిపోతారు.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది.


Share

Related posts

Kiara Advani Joshful Looks

Gallery Desk

Vijaya Sai: విజయసాయిపై మాజీ మంత్రి వడ్డే ‘పచ్చకామెర్ల సామెత’ చెబుతూ ఘాటు వ్యాఖ్యలు

somaraju sharma

Nara Family: ‘నారా ఫ్యామిలీ పర్సనల్ ప్రొటెక్షన్ గ్రూప్’ కార్డు..! అలా ప్రింటేసారా..?

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar