Categories: న్యూస్

Karthika Deepam: మనవరాళ్ల కోసం విశ్వరూపం దాల్చిన సౌందర్య.. శోభకు స్ట్రాంగ్ వార్నింగ్..!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో జ్వాల సౌర్య ఒక్కరేనని తెలుసుకున్న సౌందర్య ఎంతో బాధ పడుతుంది. జ్వాల డాక్టర్ సాబ్ ను ఎంతగా ప్రేమించిందో తెలుసుకుని జ్వాలను గుండెలకు హత్తుకుని ఓదార్చుతుంది.ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.

Karthika Deepam: జ్వాల కోసం వంట చేసిన సౌందర్య:

జ్వాల కోసం సౌందర్య వంట కూడా చేస్తుంది. జ్వాలకు ముద్దలు చేసి మరి ప్రేమగా అన్నం తినిపిస్తుంది. ఇక జ్వాల మాత్రం మనసులో నాన్నమ్మ నేను ఎవరో తెలియకుండానే ఇంత ప్రేమ చుపిస్తున్నావ్ నేనే మీ సౌర్యను అని తెలిస్తే ఇంకెలా చూసుకుంటుందో అనుకుంటుంది. సౌందర్య తినిపిస్తున్నంత సేపు జ్వాల మాత్రం తింగరి అలా చేసింది.. ఇలా చేసింది అంటూ కారాలు మిరియాలు నూరుతుంది జ్వాల. సౌందర్య మాత్రం మనసులో అది ఏమి. చేసిన నీ మంచికోసమే అనుకుంటూ తింగరే హిమ అని తెలిస్తే దాని మీద మరింత కోపాన్ని పెంచుకుంటావేమో అని మనసులోనే బయపడుతుంది

శోభకు విశ్వరూపం చూపించిన సౌందర్య :

సీన్ కట్ చేస్తే సౌందర్యకు శోభ కాల్ చేస్తుంది. ‘మేడమ్ నేను శోభను..నిరుపమ్‌ని నాకిచ్చి పెళ్లి చేస్తే మీ మనవరాలు ఎవరో చెబుతాను అన్నాను కదా? ఏం ఆలోచించారు? అంటుంది ఫోన్లో. ఇక సౌందర్య మాత్రం ‘నీ అడ్రెస్ ఏదో చెప్పు శోభ.. నేనే నీ దగ్గరకి వస్తాను’ అంటుంది సౌందర్య చాలా కూల్‌గా. సరేనంటూ శోభ లొకేషన్ పంపిస్తుంది. సౌందర్య మేడమ్ రాగానే డీల్ సెట్ చేసుకుంటాను అనుకుని శోభ మురిసిపోతుంది.ఇంతలో సౌందర్య వస్తుంది. రండి మేడం కూర్చోండి అంటుంది శోభ. ‘పర్లేదులే చెప్పు అంటుంది సౌందర్య. ‘అదే మేడమ్ నేను చెప్పింది ఏం ఆలోచించారు అంటుంది శోభ.‘దేని గురించి?’ అంటుంది సౌందర్య ఏం తెలియట్లుగా.

శోభను కొట్టిన సౌందర్య:

నిరుపమ్‌ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మీ మనవరాలిని చూపిస్తాను అన్నా కదా’ అంటుంది శోభ నవ్వుతూ సౌందర్య మాత్రం. కోపంగా శోభని లాగిపెట్టి చెంప మీద కొడుతుంది. శోభ సోఫాలో పడుతుంది. శోభ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటే సౌందర్య తన విశ్వరూపం చూపిస్తుంది.‘ఏం అనుకుంటున్నావే నా గురించి సౌందర్య ఇక్కడ అంటూ కళ్ళు. పెద్దవి చేసి చూస్తుంది.సౌందర్య నా పేరు.. గుర్తుపెట్టుకో సౌందర్య కొట్టిందని గుర్తుపెట్టుకో’ అంటుంది సౌందర్య. అదే మాట గతంలో జ్వాల తనని కొట్టినప్పుడు అంటుంది. ఆ సీన్ గుర్తు చేసుకుంటుంది శోభ.

నిరూపమ్ మీద ఆశ వదులుకోమన్న సౌందర్య :

ఇక శోభ ఏదో చెప్పబోతుంటే ఆపు.. నువ్వు ఏదో చెబితే అది విందామని నేను ఇక్కడికి రాలేదే.. అయినా నువ్వేంటే నాకు డీల్ ఇచ్చేది..? ఇప్పుడు చెబుతున్నాను గుర్తుపెట్టుకో.. నా ఫ్యామిలీ జోలికి కానీ.. నా మనవడు మనవరాళ్ల జోలికి కానీ వస్తే ఊరుకునేది లేదు.అప్పుడే నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది.. అతి తెలివి చూపించకు అలాగే నోరు కూడా అదుపులో పెట్టుకో శోభా అని వార్నింగ్ ఇస్తుంది. నా మనవడికి ఎలా పెళ్లి చెయ్యాలో నాకు తెలుసు. నా మనవరాలిని ఎలా కనిపెట్టాలో, ఇంటికి ఎలా తెచ్చుకోవాలో కూడా నాకు తెలుసు.. నువ్వు చెప్పాల్సిన పనిలేదు అంటుంది. నువ్వు ఎక్కువ చేస్తే ఎక్కడ నుంచి వచ్చావో మళ్లీ అక్కడికే పంపిస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది సౌందర్య.

తింగరే హిమ అని తెలుసుకున్న జ్వాల :

సీన్ కట్ చేస్తే రాత్రి పూట రోడ్డు మీద ఒక చోట నిలబడి బాగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.సరిగ్గా అప్పుడే అటుగా వెళ్తన్న శోభ హిమను చూసి ఎలాగయినా ఈరోజు హిమను జ్వాలకు పట్టియాలి అనుకుని కావాలనే జ్వాలకు హిమాలాగా కాల్ చేసి.. ‘నేను హిమని.. నన్ను చూడాలని,కలుసుకోవాలని ఉందా అయితే నేనొక లొకేషన్ పంపిస్తాను అక్కడకి త్వరగా వచ్చెయ్’ అంటూ రెచ్చగొడుతుంది. జ్వాల కోపంతో రగిలిపోతూవస్తున్న ఉండేవే అంటూ బయలుదేరుతుంది. ఇక సౌందర్య మనసులో ఉన్న బాధను ఆనందరావుకి చెప్పి సౌర్య గురించి జరిగింది చెప్పి బాధపడుతుంది. ఆనందరావు కూడా చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

54 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago