బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని టీఆర్ పి రేటింగ్స్ లో నెంబర్ 1 గా నిలిచిన సీరియల్ కార్తీక దీపం. ఇప్పటికే ఈ సీరియల్ 940 ఎపిసోడ్స్ ను విజయవంతంగా పూర్తిచేసుకున్నప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి ప్రేక్షకుల మన్నన పొందారు ఈ మలయాళ కుట్టీ ప్రేమి విశ్వనాథ్.
ఇక మనం ఎక్కడైనా వంటలక్క అన్న పేరు వినగానే మనకి వెంటనే గుర్తొచ్చేది కార్తీక దీపం సీరియల్. ఈ సీరియల్ కు అందులోనూ ముఖ్యంగా దీపకు దేశ విదేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారంటే ఆమెకు ఎంత పాపులారిటీ ఉందొ మనం అర్ధం చేసుకోవచ్చు. కార్తీకదీపం వంటలక్క గా అంత పేరును సంపాదించుకుంది కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథన్. తెలుగు కుటుంబాలలో సీరియల్స్ చూసే ప్రతి ఒక్కరికి దీప అంటే తెలుసు. ఆమెతో పాటుగా ఆమె భర్తకు కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. ఆయన ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్.
ఏ ముహూర్తాన తెలుగు రాష్ట్రాలలో కార్తీకదీపం ప్రసారమయ్యిందో కానీ అప్పటి నుంచి వంటలక్క మన వారికి తెగ నచ్చేసింది. ఆమె నటించేది కేవలం ఒక్క సీరియల్ లోనే అయినప్పటికీ, కార్తీకదీపం వంటలక్క అందరి కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు
ప్రేమి విశ్వనాధ్ తన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా తన అభిమానుల కోసం ఆర్గానిక్ ఫుడ్ ను రోజువారీ ఆహారంలో తీసుకోవాలని సూచిస్తోంది. అలాగే వీటిని తినడం వలన ఫిట్‌గా ఉంటారని వంటలక్క చెబుతోంది. సేంద్రీయం గా పండిన డ్రై ఫ్రూట్స్, ఆర్గానిక్ హనీ తినడం వలన మంచి శరీరానికి న్యూట్రేషన్ లభించి రక్తాన్ని శుభ్రం చేస్తుందని, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్‌ని మెరుగు పరుచుతుందని, కొవ్వును తగ్గిస్తుందని ఆమె చెబుతున్నారు.