Karthika Deepam: రియల్ గా కార్తీకదీపం మోనిత నీ గుర్తు చేసిన గ్యాంగ్ రేప్ బాధితురాలు..!!

Share

Karthika Deepam: తెలుగు రాష్ట్రాలలో కార్తీకదీపం సీరియల్ మంచి గుర్తింపు దక్కించుకున్న సీరియల్. ఈ సీరియల్లో వంటలక్క అంటే తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆడపడుచులకు ఎంతో అభిమానం. ఆమె ఎదుర్కొనే సమస్యలు.. పరిష్కారాలు.. బుల్లితెరపై ఆమె పలికించే హావభావాలు… వీక్షకులను రక్తి కట్టిస్తూ ఉంటాయి. అయితే వంటలక్క ఎదుర్కొనే సమస్యలకు గల కారణాలలో ఒక ప్రధాన కారణం అయినా పాత్ర మోనిత. ఈమె కనుక మారితే ఎన్నో సంవత్సరాల నుండి సాగుతున్న ఈ సీరియల్ కి శుభం కార్డు పడినట్లే. అందుకేనేమో డైరెక్టర్ ఎప్పటికప్పుడు మోనిత లో సరికొత్త పాత్రలు చూపిస్తూ విలనిజాన్ని పండిస్తూ… ఏళ్లకు ఏళ్ళు తరబడి.. సీరియల్ పొడిగిస్తూ వస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవల సీరియల్ లో సంచలనంగా మారిన సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కీలక ఎపిసోడ్.. ఉద్ధాంతం మాదిరిగా తాజాగా ఇటీవల రియల్ లైఫ్ లో ఉన్న పోలీసులకి ఊహించని షాక్ గట్టిగా ఎదురయ్యింది.

Karthika Deepam preview: Karthik to confront Monitha; here's why - Times of India

విషయంలోకి వెళితే మోనిత పాత్ర డాక్టర్ బాబు ను సొంతం చేసుకోవాలని కార్తీకదీపంలో తహతహలాడుతుంటాది. కానీ డాక్టర్ బాబు వంటలక్క ను పెళ్లి చేసుకోవటంతో తాను ప్రేమించిన అబ్బాయిని వేరే అమ్మాయి సొంతం చేసుకోవడం… తట్టుకోలేని మోనిత పాత్ర ఎలాగైనా పెళ్లి అయినా గాని అబ్బాయిని సొంతం చేసుకోవాలని రకరకాల ప్లాన్ లు వేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సీరియల్ లో డాక్టర్ బాబు తనని చంపేసినట్టు మోనిత వాతావరణం క్రియేట్ చేసి ఆమెకు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి అదే సమయంలో డాక్టర్ బాబు ని జైల్లో కి పంపించటం తెలిసిందే. ఆ తర్వాత వంటలక్క చంపేసి… తాను కోరుకున్న డాక్టర్ బాబు ని బయటకు తీసుకొచ్చి పెళ్ళాడాలని మోనిత యొక్క ప్లాన్.

Karthika Deepam: Deepa to throw a unique challenge at Monitha - Times of India

ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ ఈ విధంగా సాగుతూ ఉంటే సరిగ్గా ఈ తరహాలోనే మోనిత క్యారెక్టర్ ని సీరియస్ గా తీసుకున్నట్లు సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ ఉదంతం లో బాధితురాలు నటన బయటపడింది. మేటర్ లోకి వెళ్తే తన ని దారుణంగా అత్యాచారం చేసినట్లు నాటకమాడి.. పక్కా స్క్రిప్ట్ పరంగా పోలీసులకు స్టోరీ అల్లేసింది. అయితే బాధితురాలు చేసిన పర్ఫామెన్స్ కి సీరియస్ గా విచారణ చేపట్టిన పోలీసులకి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది. సదరు యువతిని గ్యాంగ్ రేప్ చేసినట్లు నమ్మించి తను ప్రేమించిన కుర్రాడు తన ని కాదని మరో పెళ్లి చేసుకోవడంతో అతడిపై కక్ష పెట్టించుకుని.. సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ బాధితురాలు కార్తీకదీపం మోనిత మాదిరి ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐదు సంవత్సరాల పాటు చెడిపోయి ఉన్న బస్సులో తనని.. అత్యాచారం చేసినట్లు బాధితురాలు పేర్కొనడంతో… పోలీసులు.. ఆ బస్సుని క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ అత్యాచారం చేసిన ఘటనలు ఎక్కడ బయట పడలేదు.

 

ఇదే సమయంలో బాధితురాలు కావాలని తన ఒంటిపై గాయాలు చేసుకోవడం తో పాటు ఆమెను.. వైద్య పరీక్షలకి పంపించగా అక్కడ మొత్తం గుట్టు బయట పడటం తో పోలీసులకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయినది. ఈ క్రమంలో విచారణ చేస్తున్న సమయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు ఇనిస్ట్యూట్ నుండి ఇంటికి వస్తున్న సమయంలో అత్యాచారం చేసినట్లు… పోలీసులకు తెలపటంతో.. సీనరీ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయం.. ఆమె ఫిర్యాదు చేసిన సమయం రెండిటికీ పొంతన లేకపోవడంతో అనేక అనుమానాలు రావడంతో కౌన్సిలింగ్ చేయడంతో.. బాధితురాలు అసలు విషయాన్ని వెళ్లగక్కింది. ప్రేమించిన యువకుడు అప్పటికే పెళ్లి కావటం ఆ పెళ్ళిని పెటాకులు చేయడం కోసం తను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి… అతని పై మోజు తోనే సంతోష్ నగర్ బాధితురాలు ఈ సీరియల్ మాదిరి నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు.


Share

Related posts

Atibala Plant: మనిషి శరీరాన్ని వజ్రంలా చేసే ఈ మొక్క గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!!

bharani jella

కట్టుకున్న భార్య ఏకాంత వీడియోలతో..! గుంటూరులో ఓ భర్త నీచాతినీచం..!!

Yandamuri

10 వేల కోట్ల లాటరీ తగిలింది!

Kamesh