NewsOrbit
Telugu TV Serials న్యూస్

Karthikadeepam : మోనితను ఒక ఆట ఆడుకుంటున్న దుర్గ… దీపగా అండగా నిలిచిన రాజ్యలక్ష్మి..!

Karthika Deepam October 10 today episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1478 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 10 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో సంగారెడ్డి బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొనటానికి ఊరి ప్రజలందరూ ఒక దగ్గరకు వస్తారు. అప్పుడు రాజ్యలక్ష్మి వారందరినీ ఆహ్వానిస్తూ, ఇక్కడ బతుకమ్మ సంబరాలు ఎప్పుడూ ఘనంగా జరుగుతాయని మరి కాసేపట్లో ప్రారంభం అవుతాయని మైక్ లో అందరికీ ఆహ్వానం పలుకుతుంది. లోపల దీపా బ్రతకమ్మని పేరుస్తూ, బతుకమ్మకు తన భర్తతో బ్రతికే అవకాశాన్ని ఇవ్వమని వేడుకుంటుంది.అప్పుడు డాక్టర్ వాళ్ళ అమ్మ వచ్చి మా రాజ్యలక్ష్మి, ఆ బతుకమ్మ నీకు అండగా ఉండగా నీకు ఎలాంటి అన్యాయం జరగదు తల్లి అని చెప్తుంది.

దీప గురించి టెన్షన్ పడుతున్న మోనిత :

Monitha tensed about deepa

సీన్ కట్ చేస్తే మోనిత కావేరీతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనటానికి వస్తూ దారిలో కావేరి ఏంటి ఆ దీప ఎక్కడ కనిపించడం లేదు ఊరి వాళ్ళతో తిట్టించామని నీ జోలికి గాని, కార్తీక్ జోలికి గాని రావడం లేదు అని చెప్తుంది. అప్పుడు మోనిత, అది అంత తేలిగ్గా వదిలేసి వెళ్ళిపోయే రకం కాదు కావేరి.అప్పట్లో మనం ఊరి వాళ్ళతో తిట్టించినప్పుడు ఏడుచుకొని వెళ్ళిపోయింది.కానీ, ఈసారి తన కళ్ళల్లో కొంచెం కూడా భయము కనిపించలేదు నాకేదో తేడా కొడుతుంది అంటుంది మోనిత. నువ్వు ఏమి బయపడకు నీకు నేను ఉన్నాను.మళ్లీ నీ జోలికి వస్తే ఇంకొక పదిమందిని ఎక్కువ చేర్చి మళ్లీ తిట్టిస్తా అని చెప్తుంది కావేరి

అమ్మ కోసం సౌర్య వెతుకులాట :

Sourya indrudu chandramma


మళ్ళీ సీన్ శౌర్య వాళ్ళ దగ్గర ఓపెన్ అవుతుంది. ఆటోలో వెళ్తున్న సౌర్య ఉన్నటుండి ఆటో ఆపు బాబాయ్ అని అరుస్తుంది.ఆటో ఆపిన చంద్రుడు కిందికి దిగి ఏమైంది జ్వాలమ్మ ఎందుకు ఆటో ఆపమన్నావు అని అడుగుతాడు. హోటల్లో నువ్వు ఎవరిని చూశావు బాబాయ్ అని అడుగుతుంది జ్వాల. ఆరోజు నువ్వు ఫోన్లో చెప్తే సరుకు లిస్టు రాసింది అని చెప్పాను కదా ఆవిడే అని చెప్తాడు.
ఆవిడ మా అమ్మేమో అని అనుమానంగా ఉంది బాబాయ్, ఆ రోజు చేతిరాత చూసి మీకు చెప్పాను కదా మా అమ్మ లాగా ఉంది అని చెప్తుంది. కానీ ఈరోజు తను వెనకనుంచి వెళ్తుంటే ఎందుకో మా అమ్మలాగే అనిపించింది బాబాయ్ అని కంగారుగా చెప్తుంది శౌర్య. మీ అమ్మానాన్న లేరని మీ ఆంటీ ఎవరో వాళ్ళకి దహన సంస్కారాలు కూడా చేశారని చెప్పావు కదా అని చంద్రుడు అంటాడు.అప్పుడు జ్వాల ఏడుస్తూ, ఏమో బాబాయ్ ఆ గొంతు అమ్మలాగే ఉంది, ఆ చేతిరాత కూడా అమ్మదిలాగే అనిపిస్తుంది. వెనకనుంచి చూసినా కూడా అమ్మలాగే ఉంది అని అంటుంది. ఒకవేళ కాకపోయినా ఒకసారి చూస్తే అవునా కాదా అని నా అనుమానం తీరిపోతుంది అని చెప్తుంది. అదే మా అమ్మయితే నా బాధలన్నీ తీరిపోతాయి కదా అని అంటుంది. ఆ ఊర్లోనే ఎక్కడో ఉంటుంది బాబాయ్ వెతుకుదాం అని అంటుంది శౌర్య.సరే అని చెప్పి అందరూ కలిపి ఆటోలో వెతకడానికి బయలుదేరుతారు.

మోనిత భరతం పట్టడానికి వచ్చిన దుర్గ :

Durga


ఇక దుర్గ, దీపను వెతుక్కుంటూ బతుకమ్మ సంబరాలు జరుగుతున్న ఊరికి వచ్చి దీప కోసం వెతుకుతుంటే దీప వాళ్ళ అన్నయ్య వచ్చి దీప ఎక్కడుందో చెప్తాడు. ఆ మోనిత కూడా కార్తీక్ సార్ ను తీసుకుని వచ్చిందటగా ఈసారి నేనే ఇచ్చే షాక్ కు మోనిత దిమ్మ తిరిగిపోతుంది అంటాడు దుర్గ.
మోనిత, కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వెనకనుంచి వచ్చి దుర్గ పలకరిస్తాడు. అదేంటి మోనిత కలిసి వెళ్దాం అని చెప్పి నన్ను ఒక్కడినే వదిలేసి,నువ్వు కార్తీక్ సార్ తో వచ్చేసావ్ అంటాడు. బైక్ మీద ఇంతసేపు జర్నీ చేసేటప్పటికి ఒళ్ళు అంతా హునం అయిపొయింది తెలుసా అంటాడు.

కార్తీక్ దగ్గర మోనితను ఇరికించిన దుర్గ :

Durga monitha


అప్పుడు మోనిత కంగారుగా దుర్గతో నేనెందుకు రమ్మంటాను నిన్ను, ఇదేమైనా నీ ఊరా అని అడుగుతుంది. లేకపోతే నీవురా అని దుర్గ తిరిగి అడుగుతాడు. ఇది నేను పుట్టి పెరిగిన ఊరు అప్పుడే మర్చిపోతే ఎలా అని తనని అడుగుతాడు దుర్గ. ఈలోపు ఊరిలో వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి దుర్గని పలకరిస్తూ ఉంటారు. అప్పుడు ఒకడు వచ్చి, దుర్గా వచ్చావా ఇందాక మోనిత ఒక్కత్తే వస్తే నువ్వు రాలేదు అనుకున్నాను అనడంతో మోనిత షాక్. అయిద్ది.అప్పట్లో మీరిద్దరూ ఎప్పుడు కలిసి ఉండేవారు కదా అని అంటాడు.ఇక కార్తీక్ కోపంగా మీరిద్దరూ కలిసి వెళ్ళండి నేను ఎందుకు అని ముందుకు వెళ్లిపోతాడు. అప్పుడు మోనిత దుర్గ తో ఏంట్రా డ్రామాలు వేస్తున్నావ్ ఇది నీవూరా వాళ్ళందరూ నీ వాళ్ళ ఏంటి డ్రామాలు అని అడుగుతుంది. ఇప్పుడు దుర్గ, నువ్వు నేర్పిందే కదమ్మా బంగారం ఇలాగే డ్రామాలు వేసి దీపమ్మని ఏడిపించావు. అప్పుడు ఆమె ఎంత బాధ పడుతుంది.కార్తీక్ సార్ కి,నేను నీ భార్యను కాదు దేపమ్మే నీ భార్య అని చెప్పు అప్పటివరకు నేను నిన్ను ఇలా ఏడిపిస్తూనే ఉంటాను అని అంటాడు.నేను ఎప్పటికీ అలా చెప్పను అని చెప్తుంది మోనిత.

ఆదిత్య పేరు విన్న కార్తీక్ :

Karthik siva


ఇక కార్తీక్ ఒకచోట ఉంటే అక్కడకి శివ వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతాడు. థాంక్స్ ఆదిత్య అనగానే సార్ నా పేరు ఆదిత్య కాదు శివ అని అంటాడు. ఆదిత్య అనగానే కార్తీక్ కి గతం ఛాయలు గుర్తుకొచ్చి తల పట్టుకుంటాడు. సార్ మీరు బలవంతంగా ఏది గుర్తు తెచ్చుకోకూడదని మేడం చెప్పారు కదా అని శివ చెప్తాడు.ఆదిత్య అనగానే నాకు ఏదో బోర్డు గుర్తొచ్చింది. ఆ పేరుకి నాకు ఏదో సంబంధం ఉన్నట్టు గట్టిగా అనిపిస్తోంది అంటాడు కార్తీక్.

రాజ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో దీపను చూసి షాక్ అయిన మోనిత :

Rajyalakshmi deepa


ఇక మోనిత,కావేరి ఇద్దరు కూడా రాజ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో జరిగే సంబరాల దగ్గరకు వస్తారు.అక్కడ దీప కూడా ఉంటుంది.ఇక కావేరి మాత్రం ఆ దీప పరువును రాజ్యలక్ష్మి దగ్గర కూడా తీసేస్తే ఆవిడే దీపని బయటికి పంపించేస్తారు. ఆ విధంగా మన వాళ్ళందరిని సెట్ చేశాను అని చెప్తుంది.అప్పుడు కావేరి ఎరేంజ్ చేసిన ఒకావిడ రాజ్యలక్ష్మి గారు ఆ టక్కులాడిని చూసారా తన భర్తను వదిలేసి మోనిత భర్తని తన భర్త అని చెప్పుకుంటుంది అంటూ దీప వైపు చూపిస్తూ చెప్తుంది. అప్పుడు రాజ్యలక్ష్మి, ఎవరు ఆ అమ్మాయా? ఆ అమ్మాయి ఎలాంటిదో నాకు తెలుసు.మా చెల్లెలి కొడుకు, దేవుడు ఇచ్చిన చెల్లెలు అని అంటాడు అని అంటుంది.

దీపకు అండగా రాజ్యలక్ష్మి… మోనిత ప్లాన్ బట్టబయలు :

Rajyalakshmi support deepa


అప్పుడు కావేరి, లేదు పెద్దమ్మ తను అలాంటిదే అని అంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి, మోనిత వైపు చూస్తూ, ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు.అసల మీ ఇద్దరిదీ ఈ ఊరు కాదు అప్పుడు మీకు, ఈ ఊరికి ఏమిటి సంబంధం దీప గురించి నాకు తెలియదు.అయినా ఆమె మంచిదే అని ఎందుకంటున్నానంటే కథ సృష్టించింది నువ్వు కాబట్టి నిజాన్ని చెంపేయాలని చూస్తున్నది నువ్వు కాబట్టి అని మోనితతో అంటుంది రాజ్యలక్ష్మి.అడ్డు చెప్పబోయిన కావేరీ ని కూడా నువ్వు అబద్దాన్ని వెనకేసుకురాకు అని అరుస్తుంది. వీళ్ళ మాటలు విన్న కార్తీక్ ఇది మా ఊరు కాదా? వంటలక్కని అవమానించడం కోసమే మోనిత ఇదంతా చేసిందా అని మనసులో అనుకుంటాడు కార్తీక్.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju