NewsOrbit
Telugu TV Serials న్యూస్

Karthikadeepam: సౌర్య, దీప కలుస్తారా.. దీపకు అండగా ఉండేందుకు సీరియల్లో కొత్తగా ఎంట్రీ ఇవ్వొబోతున్న ఆమె ఎవరు..??

Karthikadeepam:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1476 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు ప్రసారం అక్టోబర్ 7 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో. ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది గత ఎపిసోడ్‌లో డాక్టర్ బాబు బర్త్‌డే సెలబ్రేషన్స్ ను అర్థరాత్రి దీప చేస్తుంది.మరోపక్క మోనిత కోపంతో రగిలిపోతుంది. ఇక రేపు ఉదయాన్నే ఊరిలో వారికి రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు ఉన్నాయి.మీరు తప్పుకుండా రావాలి అని కార్తీక్‌తో దీప చెబుతుంది. కానీ ఉదయాన్నే మోనిత కార్తీక్‌ని కారులో ఎక్కడికో తీసుకుని వెళ్లిపోతుంది.దీప కార్తీక్ కనిపించడంతో కంగారు పడుతూ డాక్టర్ అన్నయ్య దగ్గరకు వెళ్తుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా సాగిందనే చెప్పాలి.

దీపను కలిసిన ఇంద్రుడు :

Sourya deepa indrudu


దీప, దీప వాళ్ల అన్నయ్య, వాళ్ల అమ్మతో కలిసి సంగారెడ్డి బయలుదేరుతుంది. వెళ్తూ వెళ్తూ ఓ చోట హోటల్‌లో తినడానికి ఆగుతారు. ఇక డాక్టర్ అన్నయ్య దీపను మనం సంగారెడ్డీ ఎందుకు వెళ్తున్నాం.. ఆ మోనిత కార్తీక్ ను అక్కడికే తీసుకుని వెళ్ళింది అని ఎలా నమ్ముతున్నావ్ అంటాడు.ఇక దీప మాత్రం చాలా నమ్మకంగా ఎందుకంటే ఆల్ రెడీ డాక్టర్ బాబు ఊరు అదేనంటూ గతంలో వాళ్లందరికీ డబ్బులు ఇచ్చి అబద్దం చెప్పింది ఆ మోనిత. ఇప్పుడు ఆ నమ్మకాన్ని మరింత బలపరడానికి అక్కడికే తీసుకుని వెళ్లి ఉంటుంది అన్నయ్యా అంటుంది దీప.

సౌర్య మాటను గుర్తుపట్టిన దీప :

Sourya deepa


ఇంతలో సౌర్య, ఇంద్రుడు, చంద్రమ్మ కూడా అదే హోటల్‌కి వస్తారు. దీప వాళ్లకు కాస్త దూరంలో వెనుకవైపు వాళ్లు కూర్చుంటారు. ఇక ఇంద్రుడు చేతులు కడుక్కోవడానికి మెట్ల దిగి వెళ్తూ దీపని చూసి గుర్తుపట్టి పలకరిస్తాడు. అదే సమయంలో సౌర్య బాబాయ్ అని పిలవడంతో దీప సౌర్య గొంతు గుర్తుపట్టి వెనుక తిరిగి చూసిద్ది గాని మొక్కలు అడ్డుగా ఉండడం వలన సౌర్య కనిపించదు.. ఇక ఇంద్రుడు అమ్మా మా అమ్మాయి జ్వాల పిలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు.ఇక ఇంద్రుడు వెళ్లి చంద్రమ్మ, సౌర్యలని చేతులు కడుక్కుని రమ్మని చెప్పడంతో వాళ్లు కూడా మెట్లు దిగి వెళ్తూ ఉంటారు. అప్పుడే చంద్రమ్మ కూడా దీపను చూసి బాగున్నారా అమ్మా.. ఆ రోజు మా పపా దాహం. తీర్చడానికి వాటర్ బాటిల్‌కి డబ్బులు ఇచ్చారు కదా. ఇవిగో డబ్బులు ఆ రోజు ఇవ్వలేకపోయాను’ అంటుంది చంద్రమ్మ డబ్బులు తీసి దీపకు ఇవ్వబోతుంది.ఆ రోజే చెప్పాను కదా అండి అమ్మ కొనిచ్చిందని చెప్పండి అని ఫర్వాలేదు ఉంచండి అంటుంది దీప.ఇంతలో చంద్రమ్మని ‘పిన్నీ’ అని పిలుస్తుంది సౌర్య వాష్ బేషిన్ చోట నిలబడి. దీప మళ్లీ తిరిగి చూస్తుంది. చంద్రమ్మ వెళ్లిపోయినా తిరిగి తిరిగి చూస్తూనే ఉంటుంది. ఇంతలో దీప వాళ్ల అన్నయ్య.. ‘ఏమైందమ్మా’ అంటాడు. ‘సౌర్య మాటలా వినిపించింది అన్నయ్యా అంటే సౌర్య ఇక్కడెందుకు ఉంటుందమ్మా’ అనడంతో దీప మళ్లీ కార్తీక్, మోనితల ఆలోచనలో పడిపోతుంది.

దీపను చూసిన సౌర్య:

Sourya deepa monitha karthik


ఇక డాక్టర్ అన్నయ్య సంగారెడ్డిలో మా పిన్నీ రాజ్యలక్ష్మీ గారే పెద్దమనిషిగా ఉండి అంతా నడిపిస్తారు.ఆవిడని కలిసి జరిగిందంతా చెప్పి ఆవిడా సహాయం తీసుకుందాం అంటారు డాక్టర్, వాళ్ళ అమ్మ.ఇక దీప వాళ్లు తినేసి చేయి కడుక్కుని వెళ్తుంటే మొక్కల మధ్యలోంచి దీపని సౌర్య చూసి షాక్ అవుతుంది. వెంటనే పైకి లేచి పరుగుతీస్తుంది. అప్పటికే దీప వాళ్లు ముందుకు వెళ్లిపోతారు. ‘మీ అమ్మా నాన్న చనిపోయారు’ అనే మోనిత మాటలు గుర్తొచ్చి మళ్ళీ ఏడుస్తూ అక్కడే ఆగిపోతుంది. వెనుకే చంద్రమ్మ వచ్చి సౌర్యని పట్టుకుంటుంది.ఇక సౌర్య వాళ్ళ ఆటో, దీప వాళ్ళ కారు మధ్య రోడ్డు మీద పోటీ జరుగుతుంది.ఎలాగయితేనే సౌర్య వాళ్ళ ఆటోనే ముందుకు వెళ్తుంది.

దీపకు సహాయం చేసేదేవరు?

Deepa monitha karthik



సీన్ కట్ చేస్తే మోనిత, కార్తీక్ ఇద్దరు ఊరు వస్తారు రావడంతోనే నేత్రదానశిబిరం ఎదురుగా ఉండటంతో కార్తీక్‌కి మొదటి సారి దీపని కలిసిన సీన్ గుర్తొస్తుంది. అస్పష్టంగా కనిపిస్తున్న అతడి జ్ఞాపకాలను మోనిత గమనించి కార్తీక్‌ని డైవర్ట్ చేస్తుంది..అక్కడ బుక్ లో ఫారం ఫిల్ చేయమంటే కార్తీక్ అని రాసి వైఫ్ అఫ్ దగ్గర మోనిత అని రాసి తెగ ఆనందపడుతుంది. కాసేపటికి దీప అక్కడికి వచ్చి డాక్టర్ బాబు అనడంతో మోనిత షాక్ అవుతుంది.దీప వాళ్ల అన్నయ్య, వాళ్ల అమ్మ ఇద్దరూ కూడా దీపతో పాటే ఉంటారు. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక కొత్త క్యారెక్టర్ దీపకి సహాయం చేయడానికి ఎంట్రీ ఇవ్వబోతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N