NewsOrbit
Telugu TV Serials న్యూస్

Karthikadeepam: దీప ప్లాన్ వర్కౌట్ అయిందిగా..! మోనిత,దుర్గను అలా చూసి అయోమయంలో పడిన కార్తీక్..!

Karthikadeepam :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్‌ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.ఈ క్రమంలోనే కార్తీకదీపం సీరియల్ 1472వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 03 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో కార్తీక్ కు మోనిత మీద అనుమానం వచ్చి దీప దగ్గరకు వస్తాడు. అప్పుడే శివ ఎంట్రీ ఇచ్చి సార్ మేడం మిమ్మల్ని ఒక రెండు గంటల పాటు బయటకు ఎక్కడికన్నా తీసుకుని వెళ్ళమని చెప్పారు అనడంతో కార్తీక్ మరింత సీరియస్ అవుతాడు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.

శివ చెప్పిన మాటలతో బలపడిన కార్తీక్ అనుమానం :

Karthik siva deepa


ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.రండి సార్ వెళ్దాం మేడమ్ గారు మిమ్మల్ని అలా రెండు గంటలు బయటికి తీసుకుని వెళ్లి.. తిప్పి రమ్మన్నారు’ అని శివ అనగా కార్తీక్ అనుమానం మరింత బలపడుతుంది. ‘నాకు ఇప్పుడు రావాలని లేదు.. నువ్వు వెళ్లు’ అంటాడు కార్తీక్ విసుగ్గా. దాంతో శివ వెళ్లబోతుంటే శివకి దుర్గ ఫోన్ చేసి సినిమా చూసి ఎంజాయ్ చేసిరా అని చెప్పి డబ్బులు కూడా పంపిస్తాడు దుర్గ. అదే విషయం కార్తీక్ కు చెప్పగా కార్తీక్ ఆవేశంగా లేచి నిలబడి కూర్చున్న కుర్చీని వెనక్కి తన్నుతాడు. వెంటనే దీప కంగారుగా కుర్చీ తీసి సరిగా వేసి కూల్‌గా చేయి పట్టుకుని కూర్చోబెడుతుంది. ‘డాక్టర్ బాబు ఆవేశపడకండి.. మీరు ప్రశాంతంగా ఉండండి’ అంటుంది దీప. ‘ఇంత జరుగుతుంటే ప్రశాంతంగా ఎలా ఉండమంటావు. నేను ఒక చేతకానీ భర్తని అవుతాను.. నీకు తెలియట్లేదు’ అంటాడు కార్తీక్. అసలు వాడు శివకు డబ్బులు ఇచ్చి సినిమాకి పంపించడం ఏంటీ? మోనిత నన్ను రెండు గంటల పాటు బయటికి వెళ్లమనడం ఏంటీ? ఏం జరుగుతోంది.? ఇంతకు ముందు కూడా ఇలానే ఉండేదా? నేనే గతం మరిచిపోయి ప్రశాంతంగా ఉంటున్నానా? పిచ్చి ఎక్కిపోతుంది’ అంటాడు కార్తీక్ కోపంగా.

దుర్గను చంపడానికి మోనిత ప్లాన్ :

Durga monitha

సీన్ కట్ చేస్తే మోనిత ఇంటి ముందు దుప్పటి పరుచుకుని దుర్గ పాటలు పాడుకుంటూ ఆకాశాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. దుర్గ అటు తిరిగి పడుకోవడంతో అప్పుడే మోనిత వెనుక నుంచి పెద్ద ఇనుప రాడ్ పట్టుకుని కొట్టడానికి సిద్ధమైపోతుంది.వేంటనే దుర్గా వెనక్కి తిరిగే సరికి మోనిత రాడ్ పట్టుకుని నిలబడిపోతుంది‘ఏంటి మోనితా నన్ను పైకి పంపించేద్దాం అనుకుంటున్నావా?’ అంటాడు దుర్గ నవ్వుతూ. తెల్లముఖం వేసి నీకు దన్నం పెడతాను వెళ్లిపో దుర్గా ఇక్కడ నుంచి’అంటుంది మోనిత విసుగ్గా.
అయ్యో మోనితా నేను ఎలా వెళ్తాను చెప్పు అది అసాధ్యం.. నీకో విషయం తెలుసా? డాక్టర్ బాబు ఇప్పుడు వంటలక్క దగ్గర ఉన్నాడు కావాలంటే వెళ్లిచూడు’ అంటూ జలక్ ఇస్తాడు దుర్గ.

దీప దగ్గర కార్తీక్ ను చూసి షాక్ అయిన మోనిత :

Deepa karthik monitha



వెంటనే మోనిత దీప ఇంటికి పరుగుతీస్తుంది.చాటుగా వాళ్ల మాటలు వింటుంది. ‘మోనిత ఇంత మోసం చేస్తుందని నేను అనుకోలేదు వంటలక్కా..మమ్మల్ని రెండు గంటలు బయట తిరిగి రమ్మనడం వెనుక ఏమి ప్లాన్ వేశారు అంటూ కార్తీక్ ఫైర్ అవ్వడం, దీప అదేం అయ్యి ఉండదులెండీ డాక్టర్ బాబు అనడం చూసి మోనిత బిత్తరపోతుంది. వంటలక్క నువ్వు కలిసి ఇలా ప్లాన్ చేశారా?’ అనుకుంటూ తిరిగి ఆవేశంగా దుర్గని చంపేస్తా అంటూ బయలుదేరుతుంది. కొట్టి చంపే కంటే పాయిజన్ ఇస్తే క్షణాల్లో పోతాడుగా అనుకుంటూ పాయిజన్ ఇంజెక్షన్‌ తీసుకొస్తుంది. అటు తిరిగి పడుకున్న దుర్గ దగ్గర కూర్చుని.. నెమ్మదిగా దుప్పటి తీస్తూ ఇంజెక్షన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే దీప, కార్తీక్.. అవతల గుమ్మంలోంచి లోపలికి వస్తూ మోనిత, దుర్గను చూస్తారు.వెనుక నుంచి చూస్తున్న కార్తీక్‌కి మోనిత, దుర్గ కిస్ చేసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది.కార్తీక్ ను చూసినా మోనిత చేతిలోని ఇంజక్షన్ పక్కకు విసిరేసి లేచి నిలబడుతుంది.

దుర్గను, మోనితను అలా చూసి బిత్తరపోయిన కార్తీక్ :

Durga monitha karthik



ఏంటి మోనితా అలా కంగారు పడుతున్నావ్.. రెండు గంటలు తర్వాత రావాల్సిన నేను అప్పుడే వచ్చేశాననా? పోనీ ఇప్పుడు వెళ్లి రెండు గంటల తర్వాత రానా’ అంటాడు కార్తీక్ కోపంగా అయ్యో కార్తీక్ ఇదంతా కావాలని చేస్తున్నారు.నువ్వు నిజమని నమ్మేస్తున్నావ్ నమ్మొద్దు అంటుంది మోనిత.ఇంతలో దుర్గ అప్పుడే నిద్రలేచినట్లుగా ఆవలిస్తూ కార్తీక్ సార్ మీరా..’ అంటాడు.

మోనిత పరిస్థితి చూసి జాలిపడిన దీప, దుర్గ :

Durga deepa monitha


వెంటనే మోనిత వైపు తిరిగి.. ‘ఏంటి మోనితా? కార్తీక్ సార్ బయటికి వెళ్లారు రెండు గంటల దాకా రారు అన్నావ్ అప్పుడే వచ్చేశారేంటీ?’ అంటాడు దుర్గ. వెంటనే కార్తీక్ కోపంగా లోపలికి వెళ్లిపోతాడు. మోనిత దీప, దుర్గలపై రగిలిపోతూ ఇదేమైనా మీకు న్యాయమా అంటూ కన్నీళ్లు కూడా పెట్టుకుంటుంది. దాంతో దీప, దుర్గ పెద్దగా నవ్వుతూ ‘దెయ్యాలో వేదాలు వల్లించినట్లు ఉంది’ అంటూ హేళన చేస్తారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

siddhu

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

Manasu Mamatha: ఎట్టకేలకు విడాకులపై నోరు విప్పిన ప్రియతమ్ చరణ్.. బయటపడ్డ అసలు నిజాలు..!

Saranya Koduri