న్యూస్ సినిమా

తగ్గేదేలే అంటున్న కార్తికేయ 2.. పుష్ప రేంజ్‌లో అక్కడ వసూళ్లు..!

Share

నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లో కార్తికేయ హిందీ డబ్బింగ్ వర్షన్‌కి కూడా చాలా వ్యూస్ వచ్చాయి. అలా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా తెగ నచ్చేసింది. అయితే రెగ్యులర్‌గా థియేటర్లలో సినిమాలు చూసే బాలీవుడ్ ఆడియన్స్‌కి మాత్రం కార్తికేయ సినిమా గురించి పెద్దగా తెలియకపోవచ్చు. నిజానికి ఎనిమిది ఏళ్ల క్రితం కార్తికేయ మూవీ వచ్చింది. ఇప్పుడు సీక్వెల్‌గా కార్తికేయ 2 రిలీజ్ అయింది. ఈ ఏజ్ యాప్ వల్ల కూడా ఇతర భాషల వారు కార్తికేయ 2 సినిమాపై ఎలాంటి అవగాహన ఉండదు పోవచ్చు. ఇక హిందీలో ప్రమోషన్లు కూడా ఎక్కువగా చేయలేదు. ఈ సినిమా విజయవంతంగా రిలీజైతే చాలు అనుకున్నారు మూవీ బృందం. ఎందుకంటే కార్తికేయ2 రిలీజ్ అయిన వారంలోనే అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ రిలీజ్ అయ్యాయి. దాంతో కార్తికేయ 2 సినిమాకి నార్త్ ఇండియాలో థియేటర్లు కూడా దొరకలేదు.

నార్త్‌లో అదరగొడుతున్న కార్తికేయ 2

ఏదో రిలీజ్ చేయలేదు అన్నకోకుండా చాలా తక్కువ థియేటర్లలో పరిమిత సంఖ్యలో షోలు వేశారు. అసలు ఈ సినిమానే అక్కడ ఎవరు పట్టించుకుంటారులే అని అందరూ అనుకున్నారు. అసలు ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియకుండా పోతుందన్న వారూ ఉన్నారు. కానీ ఈ సినిమా మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది. మొదటి రోజే కార్తికేయ 2 సినిమా హిందీ వెర్షన్‌కి మంచి రెస్పాన్స్ లభించింది. హిందూ దేవుళ్లు, పురాణాల గురించి ఈ సినిమాలో గొప్పగా చెప్పడం, అంతే కాకుండా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉండటంతో నార్త్ ఇండియన్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఉత్తర భారతదేశంలో రోజు రోజుకి కార్తికేయ 2 థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరుగుతోంది.

పుష్ప సినిమాను తలపించేలా రెస్పాన్స్

హిందీలో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన పుష్ప సినిమా ఎలా ఆడియన్స్‌ను ఉర్రూతలూగించిందో… ప్రస్తుతం కార్తికేయ 2 కూడా బాలీవుడ్ మూవీ లో చిత్తుచేస్తోంది. ఈ సినిమా పుష్ప లాగా భారీ స్థాయిలో వసూళ్లు సాధించకపోవచ్చు, కానీ ఈ సినిమాకి ప్రేక్షకాదరణ వేగంగా పెరిగిపోతూ మంచి కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ క్రేజ్ చూస్తుంటే హిందీ వర్షన్ ఫుల్ రౌండ్ కలెక్షన్లు రూ.10 కోట్లు రేంజ్‌ని దాటినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అలా జరిగితే ఈ సినిమా భారీ కలెక్షన్లు సంపాదించినట్టే.


Share

Related posts

Eatela Rajendar: ఈట‌ల చేసిన ఒకే ఒక త‌ప్పు… ఎన్ని మాట‌లు ప‌డేలా చేస్తోందంటే…

sridhar

Airtel Data : ఎయిర్ టెల్ లో 6GB కూపన్ ఫ్రీ..

bharani jella

Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్ కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన ప్రియా ఆంటీ..!!

sekhar