ఇంకొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరం అంటే ఆమాత్రం హంగామా ఉండాలి కదా. ఉండకపోతే ఎట్లా. అందుకే ఈటీవీలో డిసెంబర్ 31న స్పెషల్ ప్రోగ్రామ్ రాబోతోంది. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, అనసూయ, ప్రదీప్, బాబా భాస్కర్, రోజాతో ఈ షోను నిర్వహించారు. ఈ షోకు ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ గెస్ట్ గా వచ్చాడు.

ఆయన గెస్ట్ గా రావడమే కాదు.. అనసూయతో కలిసి ఆర్ ఎక్స్ 100 సినిమాలోని పిల్లారా పాటకు బీభత్సంగా స్టెప్పులేశాడు. అను కూడా కార్తికేయతో కలిసి సూపర్ స్టెప్పులేసింది.
వాళ్ల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోగానే… యాంకర్ ప్రదీప్… అబ్బో.. డ్యాన్స్ బాగానే వేశావుగా అంటూ కార్తికేయతో అనడంతో… షోకు వచ్చి.. అనసూయ ఉండగా.. అనసూయతో డ్యాన్స్ వేయకుండా ఉంటే ఎలా ఉంటది. ఇంటికెళ్లాక మా అమ్మ నాకు అన్నం పెడుతుందా.. అంటూ పెద్ద బాంబు పేల్చాడు కార్తికేయ.
దీంతో సెట్ లో ఒకటే నవ్వులు. చివరకు అనసూయ కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. వామ్మో.. కార్తికేయలో ఈయాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు.
నేను ఏంటో అనుకున్నా కానీ.. వేరే లేవల్ అంటూ రోజా కూడా కార్తికేయపై సెటైర్లు వేసింది. మొత్తానికి డిసెంబర్ 31న రాత్రి అందరినీ నవ్వించడానికి డీజే 2021 షో సిద్ధంగా ఉంది. మరి మీరు కూడా రెడీ అయిపోండి. అప్పటి వరకు ఈ ప్రోమోను చూసేయండి.