Karthika deepam: రుద్రాణి చేతిలో కోటేష్, శ్రీవల్లిలతో పాటు దీప -కార్తీక్ కూడా చనిపోతున్నారా..??

Share

Karthika deepam:ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న కార్తీక దీపం సీరియల్ గత ఎపిసోడ్‌లో రుద్రాణిని అరెస్ట్ చేయడం, బాబు తిరిగి శ్రీవల్లి, కోటేష్ వాళ్లని చేరుకోవడం జరుగుతుంది. అయితే రుద్రాణి స్టేషన్‌కి వెళ్తూ వెళ్తూనే పగతో రగిలిపోతుంది. ‘శ్రీవల్లీ.. నా మీద కేసు పెట్టి జీవితంలో చాలా పెద్ద తప్పు చేశావ్’ అని మనసులోనే ఆవేశంతో ఊగిపోతుంది. మరోవైపు సౌందర్యకు కార్తీక్ ఫోన్ తీసుకున్న బిచ్చగాడిని రత్నసీత తీసుకొచ్చి నిజం చెప్పిస్తుంది.కార్తీక్ విషయంలో మాకు సహాయం చేయమని బిచ్చగాడు అయిన మహేష్ ను అడుగుతుంది సౌందర్య. అతను కూడా సరేనంటాడు.అక్కడితో నిన్నటి ఎపిసోడ్ పూర్తయింది.

Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్.. “అతడు” సీక్వెల్..??

సంతోషంలో దీప…. బాధలో కార్తీక్ :

ఇంకా ఈరోజు ఎపిసోడ్ లో రాత్రిసమయంలో కార్తీక్ దిగులుగా బయట కూర్చుని ఉండడం చుసిన దీప కార్తీక్ దగ్గరకు వెళ్లి ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను కార్తీక్ బాబు అంటుంది. ఆ రుద్రాణి అరెస్ట్ అయ్యింది కదా.. చాలా హ్యాపీగా ఉంది..’ అంటూ పక్కనే కూర్చుంటుంది జంతికలు తింటూ నవ్వుతుంది. ‘దీపా అలాంటి వారిలో మార్పు ఎప్పటికి రాదు దీపా.పైగా పగ పట్టే ప్రమాదం కూడా ఉంటుంది అంటాడు. శ్రీవల్లి వాళ్లు అలా ఆ రుద్రాణిపై కేసు పెట్టకుండా ఆమెను బతిమలాడి బాబుని తెచ్చుకుంటే సరిపోయేదేమో అనిపిస్తోంది’ అంటాడు కార్తీక్ బాధగా..పోనీలెండీ జరిగిపోయింది కదా.. వదిలేయండి’ అని సద్దిచెబుతుంది దీప.

Allu arjun – NTR – Ram charan: ఇది అల్లు అర్జున్ వల్ల కాలేదు..ఎన్టీఆర్, చరణ్ సాధించారు..
పొట్టేళ్లను( కోటేష్,శ్రీవల్లి )బలిచ్చే సమయం అయిందని ఏర్పాట్లు చేసిన రుద్రాణి :

ఇంటికి చేరుకున్న రుద్రాణి.. తన ఇంటి గుమ్మం ముందు కారు దిగుతుంది.తనకు జరిగిన అవమానం గుర్తు చేసుకుంటూ కూర్చీలో కూర్చుంటుంది రుద్రాణి. ‘అమ్మోరికి బలిచ్చే టైమ్ వచ్చిందిరా.. అమ్మోరికి గుడి దగ్గర బలివ్వాలి. అమ్మకి ఆగ్రహం వచ్చిందేమో.. మనోళ్లందరికీ మేకపోతుల మాంసంతో భోజనం పెట్టాలి..’ అంటుంది రుద్రాణి కోపంగా.‘అక్కా ఎన్ని బలివ్వాలి?’ అంటాడు ‘రెండు’ అంటుంది రుద్రాణి. ‘ఒకేసారి రెండా’ అంటాడు. రుద్రాణి ఊ అంటుంది.అందరూ దగ్గర ఉండి పనులు చూడండి.. బలి ఇవ్వడానికి ఏర్పాట్లు చేయండి అని అక్కడి నుంచి లేచి వెళ్తుంది రుద్రాణి. ఇంతలో అబ్బులు.. ‘కోటేష్, శ్రీవల్లిని ఉద్దేశించి అక్కా బలి రెండు అన్నావ్, తప్పదా?’ అంటాడు. ‘తప్పడం లేదురా అబ్బులు. అనవసరంగా ఎవరన్నా అడ్డొస్తే వాళ్లిద్దరినీ(దీప, కార్తీక్‌లని) కూడా చంపెయండి’ అంటుంది రుద్రాణి.

మోనితకు చుక్కలు చూపిస్తున్న బస్తీవాసులు :

ఇక మోనిత విషయానికి వస్తే బస్తీలోనే ఉంటున్న మోనితకి అక్కడ బస్తీవాసులు పాలు, పేపర్ లాంటివి అమ్మకుండా చేస్తారు. దాంతో మోనిత రగిలిపోతుంది. ‘ఈ బస్తీవాళ్లు ఎంతకాలం అలా ఉంటారో నేను చూస్తాను’ అనుకుంటుంది. ఇక ఫోన్‌లో కోటేష్ ఫొటో చూస్తూ.. ‘రేయ్ నా బాబునే ఎత్తుకుని పోతావా.. నీ జీవితంలో అసలు సంతోషం అనేదే ఉండదురా..ఎలాగయినా నిన్ను పట్టుకుంటాను. అంటూ మనసులోనే పాపం కోటేష్ ను తిట్టుకుంటుంది. మరోవైపు శ్రీవల్లి, కోటేష్‌లు గుడికి వెళ్లడానికి సిద్ధమవుతారు. ‘దీపక్కా మేము గుడికి వెళ్లివస్తాము. బాబుని చూసుకో.. వచ్చేస్తాం..’ అంటుంది శ్రీవల్లి. సరేనంటుంది దీప. వాళ్లు స్కూటర్ మీద బయలుదేరతారు.బాబును ఊయలలో పడుకోబెట్టు ఊపుతున్న సమయంలో కార్తీక్ వస్తాడు. అప్పుడు బాబును ఉద్దేశించి వీడు గొప్పవాడండీ.. నామకరణానికి అడ్డొచ్చిందని రుద్రాణిని పోలీస్ స్టేషన్‌కే పంపించేశాడు..’ అంటుంది దీప నవ్వుతూ.

కోటేష్,శ్రీవల్లి గురించి ఆందోళన చెందుతున్న దీప, కార్తీక్ :

అయితే కార్తీక్ మాత్రం ముఖం బాధగా పెట్టి.. ‘ఆ రుద్రాణి రాత్రే ఇంటికి వచ్చేసిందంట దీపా అంటాడు. కార్తీక్ మాట విని దీప షాక్ అవుతుంది. ‘అలా ఎలా అండి?’ అంటుంది. రుద్రాణి పగ బడితే అస్సలు వదలదని అందరు అంటున్నారు దీప. కోటేష్ వాళ్లకి ప్రమాదం పొంచి ఉంది దీపా అని కార్తీక్ చెబుతాడు. ఆ మాటలు విని దీప బయపడుతూ ఆలోచనలో పడుతుంది. ఇక శ్రీవల్లి, కోటేష్‌లు స్కూటర్‌పై వెళ్తూ బాబు గురించి, దీప, కార్తీక్‌ల మంచితనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఆగి ఉన్న లారీని దాటుతారు. కానీ ఆ లారీలో అబ్బులు ఉంటాడు.. బైక్ పై వెళ్తున్న వాళ్ళని చూసి పోనీరా పోనీ’ అంటూ డ్రైవర్‌ని ప్రోత్సహిస్తాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. కోటేష్, శ్రీవల్లి వాళ్ళను లారీ గుద్దేస్తుందా..? కార్తీక్,దీప వాళ్ళని కాపాడతారా? అసలు వాళ్ళు బతుకుతారా? పాపం మోనిత బాబు పరిస్థితి ఏంటి? అనే మిస్టరీ వీడాలంటే రేపటి దాక వేచి చూడక తప్పదు.


Share

Related posts

అతి తక్కువ వడ్డీకే సులభంగా రూ.15 లక్షల రుణం.. అది ‘ఆన్లైన్’లోనే.. వెంటనే తెలుసుకోండి!

Teja

బ్రేకింగ్ : ఇప్పట్లో ట్రైన్లు లేనే లేవు..!  ఎప్పటి నుండి అంటే….

arun kanna

అటు రేవంత్ – ఇటు పవన్..! మధ్యలో రఘురామకృష్ణంరాజు..! ఏం లాజిక్ ఇదీ..!!

Srinivas Manem