Kartika Deepam: వంటలక్క చేసిన పనికి డాక్టర్ బాబు షాక్ … అసలు మ్యాటర్ ఏమిటంటే..?

Share

Kartika Deepam: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 7.30 అయితే చాలు కార్తీక దీపం సీరియల్ పాట వినిపిస్తూ ఉంటుంది.అంతలా తెలుగు ప్రేక్షకులు కార్తీక దీపం సీరియల్ కు అలవాటు పడిపోయారు. ఎంతలా అంటే వంటలక్క నవ్వితే ప్రేక్షకులు నవ్వుతారు.వంటలక్క ఏడిస్తే వీరు కూడా ఏడుస్తారు. పూర్తిగా కార్తీక దీపం(Karthika Deepam) సీరియల్లో లీనం అయిపోయి మరీ సీరియల్ చూస్తున్నారు. ఈ సీరియల్ కూడా రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది.

అత్తకు జలక్ ఇచ్చిన దీప :

ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య బయపడినట్లుగానే దీప కార్తీక్ పేరుతో ఉన్న దోషనివారణ స్లిప్ చూసేస్తుంది. అయోమయంలో దీప ఉండిపోయి అసలు నా వెనుక ఏం జరుగుతుందనే ఆలోచనలో పడుతుంది.కారు బయట ఫోన్ మాట్లాడుతున్న సౌందర్య కార్తీక్ (Karthik) తో దోష నివారణ పూజ గురించి చెప్పి, కారులో దీప ఉంది వచ్చాక అంతా చెబుతాను అని కంగారుగా ఫోన్ పెట్టేసి కారులో కూర్చుంటుంది.ఏంటి అత్తయ్య అని దీప అడగగా ‘అదేనే నువ్వు కనిపించక వాడు కాస్త టెన్షన్‌గా ఉన్నాడుగా నువ్వు కనిపించావ్ అని చెప్పా అంటుంది. ఆ మాట విన్న దీప కాస్త వెటకారంగా ఈ మధ్య నేను కనిపించినా గానీ కొందరు టెన్షన్ పడుతున్నారు అత్తయ్యా’ అంటుంది. సీన్ కట్ చేస్తే

Health: చక్కటి ఆరోగ్యానికి ఈ ఆరు నియమాలు..!!
దీప ఉగ్రరూపం మాములుగా లేదుగా :

కార్తీక్ బాధని చూసిన ఆనందరావు దీపకు(Deepa) నిజం చెప్పడమే సరైన పద్దతి లేదంటే రేపు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ఏమో చెప్పలేం అని కార్తీక్ ను హెచ్చరిస్తాడు. ఈలోపు దీప ఇంటికి రాగానే పిల్లలు ఇద్దరూ అమ్మా అంటూ వెళ్లి ఎక్కడికి వెళ్ళావ్ అమ్మా ! కనీసం ఫోన్ కూడా తీసుకుని వెళ్లేదు అని అనడంతో దీప ‘నేనే అంతుచిక్కని ప్రశ్నలతో ఉన్నాను ఇంకా నన్ను కొత్త ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్’ అంటుంది. ఇంతలో శ్రావ్య వచ్చి మాట్లాడే ప్రయత్నం చెయ్యగా ఇంతలో దీప పిల్లల్ని అన్నం తిన్నారా అమ్మా’ అంటుంది. ఇంకా లేదు అమ్మా నువ్వు వచ్చాక తిందామని అనేసరికి దీపకు ఆవేశంతో ఇంకా ‘తినలేదా? ఏం శ్రావ్యా వాళ్లకి కనీసం తిండి కూడా పెట్టరా నేనే లేకపోతే’ అని అరుస్తుంది. ఈలోపు పై నుంచి కార్తీక్, ఆనందరావు మెట్లు దిగుతూ దీప కోపాన్ని చూసి అవాక్ అవుతారు.
Arha: పెయింటింగ్‌తో వావ్ అనిపిస్తున్న అల్లు వారి వారసురాలు ..!
అయోమయంలో దీప :

నచ్చజెప్పాలని చూసిన శ్రావ్యతో మీరు తిన్నారుగా ఇంకా పిల్లలు తినకపోతే అలాగే వదిలేస్తారా? రేపు నేను చస్తే వీళ్లు ఇలా అనాథలు అయిపోవాల్సిందేగా ఎవరు పట్టించుకోరుగా అంటూ అరుస్తుంది. ఇక కార్తీక్ కంగారుగా..దీప ఎక్కడికి వెళ్లావ్’ అని అడిగినా సరే దీప సమాధానం చెప్పకుండా పెద్ద పెద్ద కళ్లతో కార్తీక్ వైపు కోపంగా చూస్తూ పిల్లల్ని పట్టించుకోనందుకు శ్రావ్యని తిడుతుంది. పిల్లల్ని లాక్కెళ్లి అన్నం కలిపి తినిపిస్తూ ఏదో ఆలోచిస్తూ ‘వాళ్లు పెట్టకపోతే మీకు తినాలని తెలియట్లేదా’ అంటూ తిట్టిపోస్తుంది. దీప కోపాన్ని చూసి కార్తీక్ షాక్‌లో ఉండి సౌందర్య దగ్గరకు వచ్చి.. ‘ఏదైనా నిజం తెలిసిందా దీపకి’ అంటూ మాట్లాడుకుంటారు.


Himachal Pradesh: కమల నాధులకు కలసిరాని ఉప ఎన్నికలు..! బీజేపీ ఓటమికి సూపర్ కారణం చెప్పిన హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరామ్ ఠాకూర్..! అది ఏమిటంటే..?
ఆ తరువాత ‘నిజం తెలిస్తే దీప ఇంత కూల్‌గా ఉండదుగా’ అనుకుంటాడు. ఇక సీన్ కట్ చేస్తే దీప బాధగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే పిల్లలు వెళ్లి ఏమైంది అమ్మా అంటూ అని అడిగగా దీప మాత్రం పిల్లల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఈసారి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటుంది.


Share

Related posts

చిరంజీవి ఆచార్య : అదేంటి రిలీజ్ కి ముందే ప్లాప్ టాక్ వచ్చేసింది .. కొరటాల శివా ఏంటయ్యా ఇది ?

GRK

టీడీపీని వ‌దిలేసిన చంద్ర‌బాబు…ఆవేద‌న‌లో తెలుగు త‌మ్ముళ్లు?

sridhar

 Koratala siva: కొరటాల శివ – ఎన్టీఆర్ సినిమా కథ లీక్..ఇలాంటి కథలు చాలానే వచ్చాయి కదా…!

GRK