Kartikeya: కార్తికేయ ఇక వాటికి ఫిక్సవ్వాల్సిందేనా..అంతకంటే చేయగలిగిందేమీ లేదా..?

Share

Kartikeya: కార్తికేయ ..టాలీవుడ్‌లో సినిమా ఇండస్ట్రిలో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు తెగ చేస్తున్న హీరో. అంతేకాదు ఇక్కడ అవకాశాలు అంతంత మాత్రంగా ఉండగానే కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనూ అవకాశాలు అందుకుంటున్నాడు. ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ గుమ్మకొండ. ఈ సినిమా 2017లో వచ్చింది. యూత్ లవ్ స్టోరి జోనర్‌లో వచ్చిన ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇందులో ఒకటి రెండు పాటలు మాత్రం కొన్నిరోజులు వినిపించాయి. కార్తికేయ మొదటి సినిమా చూసిన జనాలు..ఎంతో మంది కొత్త హీరోలు వస్తున్నారు..పోతున్నారు.

kartikeya-has to fix for villan roles
kartikeya-has to fix for villan roles

కార్తికేయ కూడా ఆ లిస్ట్ చేరతాడులే అనుకున్నారు. కానీ అ తర్వాత ఆర్.ఎక్స్.100 సినిమాతో కార్తికే గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు. సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అజయ్ భూపతి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఓవర్ నైట్ ఆర్.ఎక్స్ 100 సినిమాతో ముగ్గురు తెగ పాపులర్ అయ్యారు. వీరితో పాటు సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ కూడా బాగా పేరు తెచ్చుకున్నాడు. పిల్లా రా అనే పాట ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఆర్.ఎక్స్.100 సినిమా అంటే అందరికీ ఈ పాటే గుర్తొస్తుంది.

Kartikeya: ‘చావు కబురుచల్లగా’ కార్తికేయ ఖాతాలో భారీ ఫ్లాప్ సినిమాగా పడింది.

అంతగా సినిమా హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత కార్తికేయకి వరుసగా సినిమా అవకాశాలు దక్కాయి. హిప్పి, గుణ 369 సినిమాలు కూడా కార్తికేయకి తగ్గ కథలతో తెరకెక్కాయి. అయితే మొదటి సినిమా సాధించిన సక్సెస్ మాత్రం తర్వాత వచ్చిన హిప్పి, గుణ 369 సినిమా సాధించలేకపోయాయి. అయితే ఆర్.ఎక్స్.100 ప్రభావం మాత్రం కార్తికేయ మీద అలాగే ఉండటంతో హీరోగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. 90 ఎం.ఎల్ అనే సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. ఇందులో సింగులు సింగులు అనే సాంగ్ బాగా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇందులో కార్తికేయ గెటప్, డాన్స్ బాగా అట్రాక్ట్ చేశాయి.

కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కార్తికేయ ఆశించిన హిట్ దక్కలేదు. దాంతో కెరీర్ కాస్త డైలమాలో పడిందని టాక్ వచ్చింది. అయితే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి నటించింది. అయితే కథ, కథనాల లోపం వల్ల ‘చావు కబురుచల్లగా’ కార్తికేయ ఖాతాలో భారీ ఫ్లాప్ సినిమాగా పడింది. నిజంగా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. దాంతో కార్తికేయ ఇక హీరోగా సక్సెస్ సాధిస్తాడా లేదా అని మాట్లాడుకుంటున్నారు.

Kartikeya: కార్తికేయకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది.

అయితే మధ్యలో నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్‌గా నటించి ఆకట్టుకున్నాడు. హీరోగా చేస్తూ విలన్‌గా ఎందుకు అనుకోకుండా గ్యాంగ్ లీడర్ సినిమా చేయడం కార్తికేయకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమా వల్లే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్న వలిమై సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ రోల్ కార్తికేయకి మంచి పేరు తీసుకు వస్తుందని ఇప్పటికే వలిమై చిత్ర బృందం చాలా నమ్మకంగా ఉన్నారు. అంతేకాదు ఇకపై కూడా కార్తికేయ హీరోగా కంటే విలన్‌గా అయితేనే బాగా సూటవుతాడని చెప్పుకుంటున్నారు. దీన్నీ బట్టి చూస్తే ఇండస్ట్రీలో కార్తికేయ ఎలాగైనా నిలబడతాడని అర్థమవుతోంది. ఇక హీరోగా రాజా విక్రమార్క అనే సినిమా కూడా చేస్తున్నాడు కార్తికేయ.


Share

Related posts

క్యాష్ షోలో హీరో శ్రీకాంత్ ను అన్నయ్య అనేసిన సంగీత.. యాంకర్ సుమ షాక్?

Varun G

చైనీయుల మెడపై ‘సోషల్ క్రెడిట్’ కత్తి!

Siva Prasad

వామ్మో .. సంగీతానికి ఇంత శక్తి ఉందా .. మిస్ అవ్వకూడని విషయం

Kumar