Kartikeya : ప్రేమతో మీ కార్తీక్ సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన యంగ్ హీరో కార్తికేయ మొదటి సినిమాతో మంచి పేరే తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ ఎక్స్ 100 సినిమా చేశాడు. ఈ సినిమా ఊహించని విధంగా భారీ సక్సస్ అందుకుంది. డెబ్యూ సినిమాతో అజయ్ భూపతి అద్భుతమైన సక్సస్ అందుకున్నాడు. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. కాస్త బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఆర్ ఎక్స్ 100 యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా సక్సస్ తో కార్తికేయ వరసగా సినిమాలలో నటించే అవకాశాలు అందుకున్నాడు. డిఫ్రెంట్ జోనర్స్ లో సినిమాలు ఒప్పుకొని అందరిని ఆశ్చర్య పరచాడు. హిప్పీ, 90ఎంఎల్ సినిమాలు హీరోగా చేశాడు. కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా విజయాన్ని అందుకోలేకపోయాయి. మధ్యలో నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా నెగిటివ్ రోల్ చేశాడు. కానీ ఈ సినిమా నానీకే పెద్దగా ఉపయోగపడలేదు. ఇక కార్తికేయకి ఎలా ఉపయోగపడుతుంది..అనే కామెంట్స్ వినిపించాయి.
Kartikeya : కార్తికేయ ఈసారి హిట్ కొట్టి చూపిస్తానని చెబుతున్నాడు.
అయితే తాజాగా చావు కబురు చల్లగా సినిమా చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. పెద్ద బ్యానర్ కావడంతో గ్యారెంటీగా ఈ సినిమా హిట్ అని అందరూ భావించారు. కానీ కథే బాగా లేదన్న టాక్ వినిపించింది. ఫైనల్ గా చావు కబురు చల్లగా సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. అయితే కార్తికేయ.. మరో అవకాశం ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడట. ఈసారి హిట్ కొట్టి చూపిస్తానని చెబుతున్నాడు. చూడాలి మరి నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఎవరు ఇస్తారో.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!