ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విషయంలో కౌశల్ సంచలన కామెంట్స్..!!

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ 2 విన్నర్ కౌశల్ తాజాగా సీజన్ ఫైవ్ టైటిల్ ట్రోఫీ విషయంలో సంచలన కామెంట్ చేశారు. బిగ్ బాస్ షో లో.. అడుగుపెట్టిన తర్వాత కౌశల్(Kaushal) కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్లకు కెరియర్… మళ్లీ డౌన్ ఫాల్ అయ్యే రీతిలో..కెరియర్ తలకిందులు అయిపోయింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం యూట్యూబ్ లో… వీడియోలు చేస్తూ… రాణిస్తున్నాడు. మరోపక్క సినిమా రంగంలో కూడా కొద్దో గొప్పో అవకాశాలు అందుకుంటూ ఉన్నాడు. కానీ అంతకు ముందు మాదిరిగా మాత్రం కాదని టాక్. దీంతో కౌశల్ ఎక్కువగా సోషల్ మీడియా పైన కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కౌశల్ సునీల్(Sunil) హీరోగా వస్తున్న సినిమా అతడు ఆమె ప్రియుడులో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీజన్ ఫైవ్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గురించి కౌశల్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

Kaushal Reacts to Allegations On Him

సీజన్ ఫైవ్ బిగ్ బాస్(Bigg Boss) పెద్దగా ఇంట్రెస్ట్ కలిగించడం లేదని చెప్పుకొచ్చారు. సగం సీజన్ పూర్తికావటంతో టాప్ ఫైవ్ లో కి వెళ్ళేది మాత్రం ప్రేక్షకులను… ఎంటర్టైన్ చేసే వాళ్లే వెళ్తారని.. పేర్కొన్నారు. ఈసారైనా ఇంటిలో ఆడవాళ్ళ గెలుస్తారని అనుకున్నాం కాని ప్రస్తుతం హౌస్ లో ఉన్న అమ్మాయిలకు.. అంత సీన్ లేదని అర్ధమైపోతుంది అని తెలిపారు. కచ్చితంగా ఈ సారి కూడా అబ్బాయిలే విజేత అవుతారని జోస్యం చెప్పారు. దీంతో కౌశల్ చేసిన కామెంట్లపై బిగ్బాస్ ఆడియాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కచ్చితంగా కౌశల్ చెప్పిందే.. జరుగుతుందని అంటున్నారు. అమ్మాయిల విషయంలో హౌస్లో ఉన్న నలుగురిలో పెద్దగా.. ఆటలో రాణించి వాళ్ళు లేరని టాప్ ఫైవ్ లోకి వెళ్తే..సిరి(Siri), కాజల్(Kajal) వెళ్లే అవకాశాలు ఉన్నాయని మిగతా వాళ్ళకి…అంత స్కోప్ లేదు అని అంటున్నారు. ఈసారి సీజన్ ఫైవ్ బిగ్ బాస్ హౌస్ లో 19 మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభ‌మైన ఈ షోలో ప్ర‌స్తుతం 11 మందే మిగిలారు. 8 మంది ఎలిమినేట్ అయ్యారు. అందులో న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, లోబో మిన‌హా.. స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రి, శ్వేత‌, హ‌మీదా, ప్రియ‌.. ఇలా ఆరుగురు లేడీ కంటెస్టెంట్లు బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం హౌస్‌లో సిరి, కాజ‌ల్‌, ప్రియాంక సింగ్‌, యానీ ఉన్నారు.

Members of Kaushal Army accuse Bigg Boss Telugu 2 winner Kaushal Manda of  fraud - Times of India

మళ్లీ యధావిధిగా టైటిల్…

వీరిలో పింకీ మాన‌స్ కి ఫేవర్ చేస్తూ గేమ్ ఆడుతుండగా… కాజ‌ల్ స్ట్రాట‌జీ జ‌పం చేస్తోంది. యానీ మాస్ట‌ర్ ఐ తనపై తనకే నమ్మకం లేని గేమ్ ఆడుతోంది. ఇక సిరి(Siri) విషయానికి వస్తే  టాస్క్ పరంగా పోరాడుతున్నా .. ష‌ణ్ముఖ్‌, జెస్సీ(Jessy)ల‌తో మాత్ర‌మే ఎక్కువ‌గా ఉంటూ … అసలైనా టైం లో తేలిపోతుంది. దీంతో కచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంటి నుండి ఆడవాళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయని చివరాకరికి మగవాళ్లే మిగులుతారని.. మళ్లీ యధావిధిగా టైటిల్ మగవాళ్ళకి వచ్చే అవకాశం ఉందని.. కౌశల్(Kaushal) వ్యాఖ్యలు బట్టి బయట ఆడియన్స్ కూడా.. డిస్కషన్ లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న సభ్యులు ఆట తీరు బట్టి చూస్తే టైటిల్ విన్నర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా సన్నీకి.. అదే రీతిలో ఫ్యాన్ బేస్ పరంగా షణ్ముఖ్ జస్వంత్ కి ఉన్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఇక ఆ తర్వాత యాంకర్ రవి.. మానస పేర్లు వినపడుతున్నాయి. ఖచ్చితంగా వీళ్లు మాత్రం టాప్ ఫైవ్ లో ఉంటారని.. బయట జనాలు భావిస్తున్నారు. ప్రస్తుతం సగం సీజన్ పూర్తికావడంతో… ఇప్పటినుండి అసలు సిసలైన గేమ్ స్టార్ట్ అవుతుందని. రాబోయే రోజుల్లో చాలా వరకు ఇంటి నుండి అమ్మాయిలు ఎలిమినేట్ అవ్వడం గ్యారెంటీ అని.. చెప్పుకొస్తున్నారు.


Share

Related posts

బీహార్ బాహుబలి ఫైటింగ్ కౌంటింగ్ అప్ డేట్స్

Special Bureau

కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన నటి కుష్బూ..! రేపు బీజేపీలో చేరిక..!!

somaraju sharma

Vijay Deverakonda: డైరెక్టర్ సుకుమార్ కి బిగ్ షాక్ ఇచ్చిన రౌడీ విజయ్ దేవరకొండ..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar