Breaking: హైదరాబాద్ జెఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. బస్సు నుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురైయ్యారు. సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో నుండి మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు బస్సు నుండి దింపేశారు.

ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.