NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఇండియా మార్కెట్ లోకి కొత్త బైక్..! అదిరేటి ఫీచర్లతో దూసుకొస్తుంది..!!

 

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసా మోటార్స్ ఇండియా..! తన కొత్త మోడల్స్ ను త్వరలోనే దేశీయ మార్కెట్ లో విడుదల చేయనుంది..!కొత్త బిఎస్6 కంప్లైంట్ కవాసాకి నింజా 300 వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని కవాసకి తమ నింజా 300 యొక్క కొత్త బిఎస్6 వెర్షన్‌ను విడుదల చేయనుంది. బిఎస్4 కంటే బిఎస్6 ధర తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు.

దీనిని మొదటిసారి 2018లో నింజా 300 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని తయారీలో ఉపయోగించిన వివిధ బాడీ ప్యానెల్లు, బ్రేకులు, టైర్లు, హెడ్‌లైట్లు మొదలైన విడిభాగాలను కంపెనీ భారత విక్రయదారుల నుండే కొనుగోలు చేసి కంపెనీ లోకలైజేషన్ చేసింది.. ఇప్పుడు కొత్త BS6 మోటారుసైకిల్ విషయంలో కంపెనీ మరో అడుగు ముందుకు వేసి ఇంజన్ అసెంబ్లీని కూడా స్థానికంగానే తయారు చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇంపోర్టెడ్ ఇంజన్ కన్నా ఇంజన్‌ను స్థానికంగానే అసెంబ్లింగ్ చేయటం ద్వారా ఈ మోటార్‌సైకిల్ ఉత్పాదక వ్యయం తగ్గి, సరసమైన ధరకే విడుదల చేయవచ్చు.

ఫీచర్స్ :
ఇది బ్లాక్, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్, త్రీ స్టేజ్ ఫ్రాక్షన్ స్టాండర్డ్ గా వచ్చాయి. డ్యూయల్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇందులో 296సిసి పారలల్-ట్విన్ లిక్విడ్-కూల్డ్ యూనిట్‌ను ఉపయోగించారు. ఇంకా బిఎస్ 6-కంప్లైంట్ ఇంజన్ 39 బిహెచ్‌పి పవర్‌, 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. దీని ముందు భాగంలో స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ప్రీలోడ్-అడ్జస్టబల్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంది. ముందు 290 మిమీ, వెనుక వైపున 220 మిమీ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ఇవి రెండూ డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.ఈ బైక్లో ముందు, వెనుక వైపు 110/70, 140/70 ప్రొఫైళ్లతో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎమ్ఆర్ఎఫ్ టైర్లను అమర్చారు. ఇది 17-లీటర్ ఇంధన ట్యాంక్, 795 మిమీ సీట్ ఎత్తు, 179 కిలోల బరువు ఉంటుంది.

దీని స్టైలింగ్ ఇదివరకటి మోడల్ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఇంతకముందు లోకలైజ్ చేసిన బిఎస్4 కవాసాకి నింజా 300 బైక్ లు భారత మార్కెట్లో అమ్ముడయ్యాయి. కవాసాకి ఇప్పుడు మరింత లోకలైజ్ చేసిన బిఎస్6 నింజా 300ను మార్కెట్లో సరసమైన ధరకే ప్రవేశపెట్టనుంది. ఇది టివిఎస్ అపాచీ ఆర్ఆర్310 వంటి మోడళ్లకు ప్రత్యర్ధి గా నిలవనుంది.

author avatar
bharani jella

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju