NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ మాట అనే హక్కు మీకూ – మీ మావ కే‌సి‌ఆర్ కీ లేదు, హరీష్ రావు గారూ … !!

తెలంగాణ రాష్ట్ర ప్రజలు హరీష్ రావు ని దిగ్గజ రాజకీయనేతగా చెబుతుంటారు. నిత్యం అతని బావ కేసీఆర్ జపం చేస్తున్నా కూడా అతని రాజకీయ శైలి చాలా హుందాగా ఉంటుందని…. “ప్రజల పరిస్థితి అర్థం చేసుకుని సమయానుకూలంగా వ్యవహరించే నాయకుడు అతను” అని అందరూ కొనియాడుతూ ఉంటారు. అయితే ఈ కరోనా వైరస్ సమయంలో మాత్రం హరీష్ రావు ప్రజల తరఫున మాట్లాడాల్సింది పోయి ఎప్పుడూ తను వత్తాసు పలికే తన బావ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు మాట్లాడడం ఇప్పుడు బాగా చర్చనీయాంశం అయింది.

 

వివరాల్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే దీనిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా కు అవసరమైన కిట్స్, టాబ్లెట్స్, ఇంజక్షన్లు, హోమ్ క్వారంటైన్ కిట్స్ ని అందజేసిన హరీష్ రావు కరోనా వైరస్ మహమ్మారి పరీక్షలు ప్రతిరోజు నిర్వహించాలి అని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో అన్నీ సౌకర్యాలను కల్పిస్తూ ఉందని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్ళ వద్దు అంటూ హరీష్ రావు సలహా ఇచ్చారు.

హరీష్ రావు అన్న మాటలు సగం వరకు అక్షరాలా నిజమే. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే అప్పులపాలు కావడం తప్ప ఏమీ ఉండదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పిస్తోంది అన్నమాట ఎంతవరకు వాస్తవం ఆయన అసలు ఆ నమ్మకం ఇవ్వడం ఎంత వరకు సమంజసం..? అసలు ప్రజలు ఆయన మాట నమ్మాలి అంటే కరోనా వ్యాధి తెచ్చుకొని తామే స్వయంగా వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం సందర్శించాలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు…?

ఇప్పటివరకు ఎంతో మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కోవిడ్ బారినపడినా…. ఒక్కరు కూడా గవర్నమెంట్ ఆస్పత్రిలో చేరిన దాఖలాలు లేవు. సొంత నాయకులు తమ పర్యవేక్షణలో ఉన్న ఆస్పత్రిలోనే చేరేందుకు భయపడుతుంటే…. ప్రజలు ఏ ధైర్యంతో వాటిలో చేరాలని ఇప్పుడు హరీష్ రావుని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఏదైనా ఒక లాజిక్ ప్రశ్న ను అడిగితే చిర్రుబుర్రులాడే కేసీఆర్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడడంతో ఇప్పుడు అసలు ఆ మాటలు మాట్లాడే హక్కు హరీష్ రావు కి గాని అతని బావ కేసీఆర్ కు కానీ ఏమాత్రం లేవని తెలంగాణ ప్రజలు విరుచుకుపడుతున్నారు.

ఇక మరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన మొట్టమొదటి టిఆర్ఎస్ నాయకుడు ఎవరు అన్నది మాత్రమే ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారట.. టీఆర్ఎస్ నాయకులు కొట్టుకునే ‘సెల్ఫ్ డబ్బాలు’ కానేకాదట.

author avatar
arun kanna

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju