NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila : గులాబీకీ గుచ్చుకుంటున్న ముళ్ళు! కెసిఆర్ కోపం అందుకే!!

YS Sharmila ; Political TS or AP?

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల YS Sharmila  కొత్త పార్టీ పెట్టడం దాదాపు ఖాయమైంది. అన్న కు దీటుగా తెలంగాణ లో రాజకీయాలు చేసేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు. సోమవారం సాయంత్రం లోటస్పాండ్లో షర్మిల నిర్వహించబోయే కీలక సమావేశానికి వైయస్ అనుచరులు, వైయస్ కుటుంబానికి దగ్గర వారు, వైయస్ షర్మిల నమ్మదగిన వ్యక్తులు అంతా సమావేశం కానున్నారు. దీంతో ఇప్పటి వరకూ కొత్త పార్టీ ప్రకటన మీద కనీసం బయటకు కూడా రాలేదని సమాచారం ఈ సమావేశం అనంతరం అయినా బయటకు వస్తుందని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంత రహస్యంగా షర్మిల అందరితో సమావేశం అవ్వడం వెనుక రాజకీయ పార్టీ ప్రకటన, రాజకీయ పార్టీ తెలంగాణ లో పెడితే ఎలా ముందుకెళ్లాలనే అంశం ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి.

YS Sharmila : KCR fire behind sharmila political
YS Sharmila : KCR fire behind Sharmila political

YS Sharmila : ఎందుకీ రహస్యం…

వైయస్ షర్మిల పార్టీ పెడుతున్నారంటూ ఇటీవల ఓ దినపత్రికలో వరుసగా రెండు రోజులు ప్రధాన బ్యానర్ కథనం వచ్చింది. రెండు వారాలు ఆంధ్రజ్యోతిలో ఏబీఎన్ ఆర్ కె ప్రతి ఆదివారం రాసే కొత్త పలుకు లో సైతం దీని మీద ప్రధానంగా వ్యాసాలు వచ్చాయి. దీంతో పార్టీ ప్రచారం ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో వైయస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు మీద వస్తున్న కథనాలను ఖండించారు. లీగల్ గా సదరు పత్రిక మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీ పెడుతున్నానని కానీ పెట్టడం లేదని కానీ ఆ ప్రెస్ నోట్ లో ఆమె స్పష్టం చేయలేదు. జవాన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలను ఖండించడం వరకూ లీగల్గా చర్యలు తీసుకుంటామన్న మాటతోనే అది ముగిసింది. అయితే అసలు కనీసం మీడియాకు గానీ వై ఎస్ ఆర్ సి పి పార్టీ లో కీలకంగా ఉన్న వ్యక్తులకు గాని షర్మిల పార్టీ మీద పూర్తిగా అవగాహన లేదు. ఆంధ్రప్రదేశ్ లో కొందరు కీలకంగా వ్యవహరిస్తున్న వారికి తప్పితే, ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ మంత్రుల కు సైతం వైయస్ షర్మిల పార్టీ గురించి అసలు కొంచమైనా తెలియదంటే ఈ విషయాన్ని ఎంత రహస్యంగా ఉంచారు అనేది అర్థం అవుతుంది. ఓ రాజకీయ పార్టీ ప్రకటనకు ఎందుకు ఇంత రహస్యం కొనసాగించారు అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. లేదా షర్మిల చివరి వరకు పార్టీ ప్రకటన మీద నిర్ణయం తీసుకోలేక పోయారా అన్నది తెలియాలి.

కెసిఆర్ కోపం ఇందుకేనా??

తెరాస అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళి తన పాత బంధాలు ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ సమావేశంలో కాస్త కోపంగానే మాట్లాడారు. పార్టీ తీరు మీద నాయకుల వ్యవహార శైలి మీద ఆయన ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ భవన్ లోపలికి సైతం మంత్రుల కారులు రానివ్వకుండా కేవలం నడకతోనే సమావేశానికి హాజరయ్యేలా గులాబీ బాస్ ఆర్డర్ వేశారంటే కెసిఆర్ ఎంత కోపంగా ఉన్నారు అన్నది అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సమావేశంలోనే కొందరు తీరు మీద, పార్టీ వెళ్తున్న లైన్ మీద, తగ్గుతున్న ఆదరణ మీద కెసిఆర్ గట్టిగానే నేతలందరికీ క్లాస్ పీకిన ట్లు తెలిసింది. దీనంతటికీ తెలంగాణలో వైయస్ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ ప్రకటన కూడా ఓ కారణం కావచ్చు అనేది గులాబీ నేతల అంచనా. కెసిఆర్ సైతం తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళేది లేదని, కుమారుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించేది లేదు అన్నట్లుగా మరో పదేళ్లు తానే ముఖ్యమంత్రి గా ఉంటానని కుండ బద్దలు కొట్టడం వెనుక కూడా వైయస్ షర్మిల పార్టీ ప్రకటన ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కెసిఆర్ సమావేశంలోనే కొత్త పార్టీ అంటే మాటలా?? ఎన్ని పార్టీలు వచ్చాయి అన్ని పార్టీలు పోయాయి?? రాజకీయ పార్టీ నడపడం అంటే పాటలు పాడడం కాదు పిల్లి బండి పెట్టినట్లు కాదు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించడం వెనుక కూడా షర్మిల పార్టీ విషయమే ఉందని, దీని మీద తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకే అత్యవసరంగా కేసీఆర్ సమావేశం కావడంతోపాటు ప్రస్తుతం జరుగుతున్న అధికార మార్పిడి చర్చలకు ఫుల్స్టాప్ పెట్టాలని పార్టీని పూర్తిస్థాయిలో నడిపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో నానాటికీ బలోపేతం అవుతున్న బిజెపి సూచనలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటున్నారని దానిలో భాగంగానే రెడ్డి సామాజిక వర్గం ఓట్లను తెలంగాణ లో టిఆర్ఎస్ నుంచి దూరం చేసేందుకు తన చెల్లి షర్మిల తో కొత్తపార్టీ నాటకంలో నడుస్తున్నట్లు కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఆయన ఇప్పుడు భవిష్యత్ వ్యూహాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు.

 

 

 

author avatar
Comrade CHE

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju