NewsOrbit
న్యూస్

నాడు జగన్.. నేడు కేసీఆర్..! సేమ్ నిర్ణయం..!

kcr followed by taking jagan decision

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్.. వీరిద్దరి పనితీరు దూకుడుగానే ఉంటుంది. అందుకే వీరిద్దరి పాలనలో సారూప్యం కనిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ పనితీరును జగన్ ఫాలో అవుతున్నారా.. జగన్ పనితీరును కేసీఆర్ ఫాలో అవుతున్నారా అన్నట్టు కొన్ని నిర్ణయాలు కనిపిస్తూంటాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వం ఆరు నెలల కిందటే తీసుకుంది. ఏపీలో ఇంకా ఫలితాలివ్వని ఆ నిర్ణయం.. తెలంగాణలో తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

kcr followed by taking jagan decision
kcr followed by taking jagan decision

పరిశ్రమల్లో ఉద్యోగాలు స్థానికులకేనట..

ఇకపై పరిశ్రమల్లో ఉద్యోగాలు 75 శాతం స్థానికులకే అని ఏపీ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఇది ఆచరణలో సాధ్యమయ్యేది కాదని.. సాంకేతిక ఇబ్బందులుంటాయని వివరణతో సహా ఉన్నతాధికారులు సీఎం జగన్ కు వివరించారు. కానీ.. జగన్ దీనిపై ముందుకే వెళ్లారు. ఈ విషయంలోనే గత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సీఎం జగన్ కు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. స్థానిక పరిశ్రమల్లో పని చేయటానికి స్థానికులు ఆసక్తి చూపరు. యాజమాన్యం ఇచ్చే వేతనానికి వారు ససేమిరా అంటారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని గ్రానైట్ పరిశ్రమలో దాదాపు 15వేల మంది కార్మికుల్లో ఎక్కవగా బీహార్, యూపీ, రాజస్థాన్ నుంచి వచ్చిన వారే ఉంటారు. వీరికి రోజుకి 300 నుంచి 400 వేతనం ఇస్తూంటారు. అదే స్థానికులైతే రోజుకి 700 వరకూ డిమాండ్ చేస్తారు. దీంతో యాజమాన్యం పొరుగు రాష్ట్ర కార్మికులకే ప్రాధాన్యం ఇస్తుంది.

సీఎం కేసీఆర్ ఇదే నిర్ణయం..

కొత్త పరిశ్రమల్లో ఇకపై స్థానికులకే 50 శాతం ఉద్యోగాలంటూ తెలంగాణ క్యాబినెట్లో తీర్మానించారు. ఏపీలో ఆచరణలో సాధ్యంకానీ ఈ నిర్ణయం తెలంగాణలో ఏమేరకు సక్సెస్ అవుతుందో.. పరిశ్రమలు ఎలా స్పందిస్తాయో చూడాలి. కాకపోతే.. ఏపీలో 75శాతం అయితే.. తెలంగాణలో 50శాతం మాత్రమే ఇవ్వడం కాస్తంత ఉపశమనం అని చెప్పాలి.

 

author avatar
Muraliak

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju