NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ ద‌మ్మేంటో…. ఇవాళ మ‌ళ్లీ తెలిసిపోతుంది

cm kcr new strategy on settlers

తెలంగాణ ముఖ్య‌మంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజ‌కీయ చాణ‌క్యం మ‌రోమారు తెర‌మీద‌కు రానుంది. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు వేయ‌డంలో అందె వేసిన చేయి అయిన గులాబీ ద‌ళ‌ప‌తి స‌త్తా నేడు మ‌ళ్లీ తెలంగాణ ప్ర‌జ‌లు వీక్షించ‌నున్నారు.

cm kcr new strategy on settlers

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన వ్యవసాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతు సంఘాలు భార‌త్ బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్‌ ను ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియ‌న్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. ఈ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే.

 

కేటీఆర్ ఏం చెప్పాడో తెలుసా?

తేదీన భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. భారత్ బంద్‌పై కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై పార్టీ తరపున వాదనలు చెప్పాలని కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. పార్లమెంట్ లో రైతువ్యతిరేక బిల్లును టీఆర్ఎస్ వ్యతిరేకించిందని తెలిపారు. అందుకే , తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్ కావాలని ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. చల్లటి చలిలో రైతులు రోడ్ల పై పోరాటం చేస్తున్నారు.. కేంద్రం మెడలు వంచైనా రైతులకు అండగా పోరాటం చేయాలన్నారు. 8వ తేదీన రైతుబంధు కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది.. బంద్ లో పాల్గొంటున్నాము అని తెలిపారు. ప్రతీ వ్యాపారవేత్త 10గంటలకు కాకుండా 12 గంటలకు షాప్స్ తెరవండి- రెండు గంటలు బంద్ పాటించాలని కోరారు.. వాణిజ్య- వ్యాపార సంస్థలు రైతు బంద్ కు సహకరించండి. ట్రాన్స్ పోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ బంద్ కు సహకరించండి అని కోరారు. టీఆర్ఎస్ పార్టీ మంత్రులు-ఎమ్మెల్యేలు-పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపై ధర్నాలు- రాస్తారోకో చేస్తారు.. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్లమీదకు రావొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుని బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.

కేటీఆర్ , హ‌రీశ్ రావు , క‌విత కూడా…

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెలంగాణలో ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. విధులకు దూరంగా ఉండేందుకు ఉద్యోగ సంఘాలకు లేఖను పంపింది. బంద్ కు అన్ని ట్రేడ్ యూనియన్ల మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఆటో, క్యాబ్, కార్ యూనియన్లు బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బంద్ లో తెలంగాణ లారీ ఓనర్లు, డ్రైవర్లు పాల్గొననున్నారు. షాద్ నగర్ హైవేపై కేటీఆర్, సిద్దిపేట హైవే పై హరీశ్ రావు ధర్నా చేపట్టనున్నారు. ఎమ్మెల్సీ కవిత రేపు నిజామాబాద్ ముంబై హై వేపై ఉదయం 8 గంటలకు ధర్నాలో పాల్గొంటారు. అన్ని జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు బంద్ లో పాల్గొననున్నారు.

author avatar
sridhar

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju