NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బుక్కయిపోయిన జ‌గ‌న్ … ఆ మంత్రిని మెచ్చుకున్న కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక్కో అంశాన్ని ఎలా విశ్లేషిస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలా పక్కా ప్లానింగ్‌తో ఉండే తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ఓ మంత్రిని ప్ర‌శంసించారు.

ప్రగతి భవన్ లో ఆర్టీసి పైన సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

కేసీఆర్ ఏం చెప్పారంటే….

కరోనా నేపథ్యంలో వెనకంజ వేసిన ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, ఆర్టీసీ కార్మికులకు యాభైశాతం పెండింగులో ఉన్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తక్షణమే 120 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. హైద్రాబాద్ నగరంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సీఎం నిర్ణయించారు. ఆర్జీసి కార్మికులకు ఉద్యోగ భధ్రత కల్పించే విధివిధానాలపై చర్చించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో గాడిన పడుతూ లాభాల బాట పడుతున్న ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందని, అయినా వెనకడుగువేయకుండా ఆర్టీసి ని తిరిగి బతికించుకుంటామని సిఎం స్పష్టం చేశారు.

కేంద్రాన్ని తిట్టిన కేసీఆర్‌…

తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ వస్తుందని కేసీఆర్ చెప్పారు. “ఆయా సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ భధ్రతనిస్తున్నది. ఇటీవల విద్యుత్ శాఖలో ప్రయివేటు భాగస్వామ్యం పెంచాలని ఎవరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. పైగా, వేలాది మంది విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యలరైజ్ చేసింది. ఆధారపడిన కుటుంబాలను కాపాడింది. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసి సహా, ప్రభుత్వ రంగం సంస్థలను ప్రయివేటు పరం చేసుకుంటూ వస్తున్నది. అయినా తెలంగాణ ప్రభుత్వం వెకకకు పోలేదు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటుంది“ అని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

నేను ఉన్నంత కాలం…

ఆర్టీసీ సంస్థను బతికించుకోని తిరిగి గాడిన పెట్టేదాక తాను నిద్రపోనని కేసీఆర్ అన్నారు. “నేను ఉన్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంట. ఆర్టీసీ మీద ఉద్యోగులు సహా ఆధారపడిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దాంతో పాటు పేదలకు ఆర్టీసీ అత్యంత చౌకయిన రవాణా వ్యవస్థ. ఈ కారణాల చేత ప్రభుత్వం లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ప్రజా రవాణా వ్యవస్థ, ఆర్టీసిని కాపాడుకోవాలనుకుంటున్నది. ప్రభుత్వం ఆర్టీసి కి ఆర్ధికంగా అండగా నిలుస్తుంది. ఆర్టీసి కార్మికులకు ఇప్పటికే పెండింగులో వున్న రెండు నెల‌ల జీతాలను తక్షణమే చెల్లించాలి. అందుకు తక్షణమే ఆర్ధికశాఖ 120 కోట్ల రూపాయలను విడుదల చేయాలి’’ అని సీఎం స్పష్టం చేశారు.

ఆ మంత్రిని ప్ర‌శంసించిన కేసీఆర్‌

కరోనా భయంతో కొంత, వ్యక్తిగత వాహనాల వాడకం పెరిగిపోయిన కారణం చేత, కొన్ని నెలలుగా ఆర్టీసీలో ఆక్యేపెన్సీ రేషియో తగ్గిపోయిందని తద్వారా ఆర్టీసీ తిరిగి నష్టాల బాటపట్టిందని అధికారులు సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ కు వివరించారు. కాగా, కరోనా కష్టాలను దాటుకుంటూ తగు నిర్ణయాలను తీసుకోవాలని, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్టీసీకి తిరిగి కరోనా ముందటి పరిస్థితిని తీసుకురాగలమో అధికారులు విశ్లేషించుకోవాలని సిఎం ఆదేశించారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాను రాను భవిష్యత్తులో రైల్వేలో మాదిరి, ఆర్టీసీ కూడా కార్గో సేవల తో లాభాలను గడిస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కార్గో సేవలను ప్రారంభించిన అనతికాలంలోనే మిలియన్ పార్సెల్ ట్రాన్స్ పోర్టు చేసిన రికార్డును ఆర్టీసి సొంతం చేసుకోవడం పట్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడను అధికారులను అభినందించారు. సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా తెలంగాణ ఆర్టీసికి అధనంగా లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు దక్కిందని, అందుకు ఆర్టీసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ అధికారులు, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఆర్టీసీ ఒప్పందం విష‌యంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని రాష్ట్రంలోని విప‌క్షాలు టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

author avatar
sridhar

Related posts

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju