NewsOrbit
న్యూస్

స్ట్రాంగ్ పాయింట్ బయటకి లాగిన కే‌సి‌ఆర్ .. నిజమేకదా అనాల్సిందే ఎవ్వరైనా !

ఇటీవల ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ తో జరిగిన అఖిలపక్ష వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో దేశంలో ఉన్న ప్రధాన పార్టీల నేతలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా భారత్ మరియు చైనా సరిహద్దు వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు విడిచిన సైనికులకు మోడీ నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తన అభిప్రాయాలను సూటిగా స్పష్టంగా తనదైన శైలిలో తెలియజేశారు. ఇండియా మరియు చైనా సరిహద్దుల్లో జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తిగా అండగా ఉంటామని కెసిఆర్ స్పష్టం చేశారు.

KCR rushed to Delhi to meet PM Modi on bringing IIM to Hyderabad

చైనాతో సరిహద్దుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని తొందర పడకుండా, దేశ ప్రయోజనాల విషయంలో వెనుకంజ వేయకుండా, తల వంచకుండా పోరాడాలని పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తిగా కేంద్రానికి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో రాజనీతి కాదని యుద్ధనీతి అవసరమని తెలిపారు. ఇదే సమయంలో అందరూ చైనా వస్తువులు ఆపేయాలని అంటున్నారు, ఒకేసారి అలా చేస్తే మనమే నష్ట పోతామని కేంద్రానికి తెలిపారు.

Prof Nageshwar – Is KCR unwilling to take on Modi

ఈ తరుణంలో దిగుమతి తక్కువ చేస్తూ వాటికి సంబంధించిన తయారీ రంగాన్ని మన దేశంలోనే తయారు అయ్యేలా కేంద్రం సహకరించాలని, తక్కువ ధరకే లభించే లాగా దేశంలో వస్తు తయారీ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా రక్షణ వ్యవహారాల్లో మిగతా దేశాలతో వ్యూహాత్మకంగా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని చెప్పుకొచ్చారు. మరోపక్క ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ మనదేశంలోనే ఉందని అంతర్జాతీయ లెక్కలు చెబుతున్నాయి ఇందువల్లే పెట్టుబడులు మన దేశం లోకి వస్తున్నాయి. ఇది చైనా కి నచ్చటం లేదని కెసిఆర్ అన్నారు. కానీ ఈ విషయంలో కేంద్రానికి అన్ని విధాల మద్దతు ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. కాగా కేసీఆర్ అంతర్జాతీయ స్థాయిలో దేశంలో ఉన్న మార్కెట్ విషయంలో, వస్తు తయారీ విషయంలో స్ట్రాంగ్ పాయింట్ కేంద్రానికి చెప్పారని పరిశీలకులు అంటున్నారు. చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కల్లా కరోనా వైరస్ ని ఎదుర్కొన్నది భారత్ కాబట్టి..చైనాతో వ్యూహాత్మకంగా కెసిఆర్ చెప్పినట్టు డీల్ చేస్తే ఖచ్చితంగా భారత్ ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా అవతరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju