NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కొంప మునిగిపోయిన త‌ర్వాత‌… కొత్త నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్

టీఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ చాణ‌క్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎత్తులు పై ఎత్తులు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. అలాంటిది అనూహ్యంగా దుబ్బాక‌లో టీఆర్ఎస్ పార్టీ ఓట‌మి పాలైంది.

 

అత్య‌ల్ప ఓట్ల‌తో కారు పార్టీ చ‌తికిల‌ప‌డ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కారును పోలిన ఓ గుర్తు ఉండ‌టం వ‌ల్లే ఈ ర‌కంగా జ‌రిగింద‌ని విశ్లేష‌ణ‌లు వెలువడుతున్నాయి. ఈ స‌మ‌యంలో టీఆర్ఎస్ పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి తో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ,ఎమ్మెల్యే లక్ష్మ రెడ్డి,ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి భేటి అయి పలు ఎన్నికల గుర్తులపై పిర్యాదు చేశారు.

ఆ గుర్తుల‌తో….

అనంత‌రం మాజీ మంత్రి , ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కారు గుర్తును పోలిన గుర్తులు అనేకం ఉన్నాయని, వాటిని తొలగించాలని ఎస్ఈసి ని కలిశామ‌ని తెలిపారు. “మొన్నటి ఉప ఎన్నికల్లో కారును పోలిన రోటీ మేకర్ గుర్తు వలన మా అభ్యర్థి ఓడిపోయారు. గత ఎంపీ ఎన్నిక‌ల్లో ఇలాంటి గుర్తులతో భువ‌నగిరి ఎంపీ అభ్య‌ర్థి ఓడిపోయారు. గతంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి పిర్యాదు చేశాము. గుర్తులను పోలిన గుర్తులను తొలగింపు విషయంలో ఎస్ ఈ సి సానుకూలంగా స్పందించింది.“ అని తెలిపారు.

గ్రేట‌ర్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో….

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ రోటీ మేకర్ గుర్తు వలన టీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లిందని ఫిర్యాదు చేశామ‌ని వెల్ల‌డించారు. “కారు గుర్తును పోలిన ఇతర ఎన్నికల గుర్తు వల్ల ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కలుగుతోంది. కొన్ని గుర్తులను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం తో సీఈఓ ,రాష్ట్ర ఎన్నికల సంఘం కు పిర్యాదు చేశాం
ప్రతి సారి ఈ గుర్తులు ఓటర్లను గందరగోళం గురి చేస్తున్నాయి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా అలాంటి గుర్తులను తొలగించాలని పిర్యాదు చేశాం . జిహెచ్ఎంసి ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలని మా పార్టీ తరుపున కోరాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండో సారి విశ్వనగరంలో జరిగే ఎన్నికలను శాంతియుత వాతావరణం లో జరపాలి అని చెప్పాము.“ అని వెల్ల‌డించారు.

author avatar
sridhar

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!