NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Putta Madhu: ‘పుట్ట’లోంచి ‘మధు’ ని పట్టింది ఈటల కోసమేనా?కేసీఆర్ ఎవరినీ వదిలేలా లేడుగా??

Putta Madhu: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధును రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారం రోజుల నుంచి ఆయన అదృశ్యం కావడానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు. కాగా.. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు పుట్ట మధు ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. అయితే ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం.. ఆ తర్వాత ఆయన ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్ మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ప్రెస్‌మీట్ పెట్టినప్పటినుంచి పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లాడు.

KCR targets Putta Madhu for Etela Rajender
KCR targets Putta Madhu for Etela Rajender

కాగా.. ఈటల వ్యవహారం బయటకు రావడంతోనే మధుకు చెక్ పెట్టారని స్థానికులంతా భావిస్తున్నారు. ఈటల మీద వేటుపడిన తర్వాత.. క్రమక్రమంగా ఆయన అనుచరుల మీద కూడా ప్రభుత్వం కన్నేసినట్లు అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పుట్టా మధును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈటల గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకే మధును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

సస్పెన్స్ థ్రిల్లర్ తలపిస్తున్న ఎపిసోడ్!

అయితే గత వారం రోజుల నుంచి మధు.. చత్తీస్‌ఘర్‌లో ఉంటున్న తన కూతురి దగ్గర ఉన్నారని వార్తలొచ్చాయి. అదే తరుణంలో ఆయన భార్య అయిన మున్సిపల్ చైర్మన్ శైలజ.. పుట్ట మధు ఆచూకీ తెలుసుకోవాలని కోరుతూ కొంతమంది మంత్రులను కలిసి వచ్చారని తెలుస్తోంది. దాంతో పుట్టా మధు అజ్ఞాతం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత శుక్రవారం మధు భార్య శైలజ ప్రెస్‌మీట్ పెట్టి.. మధుకు కరోనా లక్షణాలున్నాయని, అందుకే ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. ఆ మరుసటి రోజే మధు తమ అదుపులో ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రెస్‌నోట్ విడుదల చేశారు.  కానీ విశ్వసనీయ సమాచారం మేరకు మధు రెండు లేదా మూడు రోజులనుంచి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదంతా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది.

అన్నీ చెప్పేశాడన్న పోలీసులు!

మంథని లాయర్ దంపతుల హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్పీ చైర్మన్ పుట్టా మధు ఎట్టకేలకు నోరు విప్పాడు. గత 10 రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఎక్కడెక్కడ తిరిగాడు, ఏం చేశాడు, ఎవరెవరిని కలిశాడు అనే వాటన్నింటికి సమాధానం చెప్పాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

author avatar
Yandamuri

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju