NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR : ఒళ్లు దగ్గర పెట్టుకోకుంటే దుమ్ము దుమ్మే:కమలనాథులకు కెసిఆర్ వార్నింగ్ మామూలుగా లేదుగా?

KCR : హాలియా (సాగర్ )వేదికగా జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు.

KCR Warning to bjp leaders
KCR Warning to bjp leaders

విపక్షాలపై పరోక్షాంగానే కన్నెర్ర జేశారు. తెలంగాణ అన్న పదాన్ని పలికే అర్హత కూడా వారికి లేదంటూ ధ్వజమెత్తారు. బీజేపీ నాయకత్వం ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరో నామినేట్ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణను ముక్కలు చేసి ఇతర రాష్ట్రాల్లో కలిపిన వాళ్లు ఎవరు? అంటూ బీజేపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో ఏం చేశారంటూ నిలదీశారు. కొత్త బిక్షగాడు పొద్దు ఎరగడు అన్నట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తాము తలుచుకుంటే బీజేపీ నేతలు దుమ్ము దుమ్ము అయిపోతారంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చోలేదని అన్నారు. టీఆర్ఎస్ అంటే వీరుల పార్టీ అని, వీపు చూపించే పార్టీ కాదని వ్యాఖ్యానించారు.

KCR : కాంగ్రెస్ నేతలనూ వదల్లే!

ఇదే సమయంలో కాంగ్రెస్‌ నేతలపైనా సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పొలం బాట, పోరు బాట అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్న కేసీఆర్.. ఉద్యమ సమయంలో ఏం చేశారని నిలదీశారు. ప్రాజెక్టుల నిర్మాణాలను కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించడాన్ని తప్పుపట్టిన ఆయన.. నాగార్జునసాగర్‌ను కూడా కమీషన్ల కోసమే కట్టారా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధువులు కాదని, రాబంధులు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఉన్నప్పుడు నీళ్లు ఆపితే ఎవరూ నోరెత్తలేదని నాటి ఘటనను గుర్తు చేసిన సీఎం కేసీఆర్.. అన్యాయం జరిగినప్పుడు కాంగ్రెస్ నేతలు కనీసం మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్ నేతలది దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అని విమర్శించారు. అలాంటి రాజ్యం కోసమే కాంగ్రెస్ నేతలు పొలం బాట పట్టారని కేసీఆర్ దుయ్యబట్టారు. ‘రాక్షసులతోనే కొట్లాడాం.. మీరో లెక్కా..’ అని వ్యాఖ్యానించారు.

అవినీతి రహితం.. సర్వత్రా సంక్షేమం!

తనది అవినీతి రహిత ప్రభుత్వం అన్న సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ‘కల్యాణ లక్ష్మి పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా? కేసీఆర్ కిట్ ఎక్కడైనా ఉందా?’ అని ప్రశ్నించారు. త్వరలోనే అర్హులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించారు.

 

author avatar
Yandamuri

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju