NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

KCR: కరోనా నుండి కాపాడాలని కేసీఆర్ కి సొంత పార్టీ వారి మొర!దొర గారు ఇప్పుడేమంటారో?

Corruption Killing India: Corona Business

KCR: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వీరవిహారం చేస్తుండగా అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కేసీఆర్ ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు.కరోనా కట్టడి చర్యలు కానీ సహాయకచర్యలు కానీ తగినట్లుగా లేవని వ్యాఖ్యానిస్తున్నారు.రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు ఓ టీఆర్ఎస్ కార్యకర్త.

KCR's own party members asks him to protect from Corona
KCRs own party members asks him to protect from Corona

కరోనాతో పోరాడుతూ హాస్పిటల్ బెడ్ పై ఉన్నారు నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలానికి చెందిన కార్యకర్త. తమ మండలాన్ని దత్తత తీసుకుంటానన్న బాల్క సుమన్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ప్రతీ కాలనీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. మండలం మొత్తం వెంటనే టెస్టులు చేయాలన్నారు. టెస్టులు ఆలస్యం కావడంతో పాటు.. బెడ్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇదేమైనా  అక్బర్,బాబర్ కాలమా? అని ప్రశ్నించారు.  సర్కార్ మూర్ఖత్వం వీడి టెస్టులు పెంచాలన్నారు. టెస్టులు పెంచకనే కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని అందరూ తిట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెస్టులు చెయ్యకపోతే.. చావులు తప్పవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ టీఆర్ఎస్ కార్యకర్త విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అయ్యింది

2 రోజులపాటు ఆత్మహత్య చేసుకున్న కరోనా రోగి శవం ఇంట్లోనే!

Corporate Business: Corona business in Telugu States

ఇకపోతే నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం, గడ్డిమున్కంపల్లి గ్రామానికి చెందిన ఉలిగుండం నర్సప్ప (48) కరోనా సోకడంతో తీవ్ర మనోవేదనకు గురై తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సప్పకు ఐదు రోజుల కిందట కరోనా సోకింది. చికిత్స విషయంలో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇంటా బయటా పరిస్థితిని చూసి చలించిపోయాడు. మనోవేదన భరించలేక రెండు రోజుల క్రితం తన ఇంటిలోనే ఉరి వేసుకొని చనిపోయాడు. కరోనా సోకిన విషయం తెలిసినప్పటి నుంచి నర్సప్ప ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. వారు కూడా అతనికి దూరంగా మసలుకోవడంతో వెలివేసినట్లు ఆత్మన్యూనతకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కరోనా భయంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేశారు. రెండు రోజులు కావడంతో వాసన రాగా చుట్టుపక్కల వారు వచ్చి అనుమానించి అధికారులకు సమాచారమిచ్చారు.అప్పుడు ఈ ఉదంతం బయటకు వచ్చింది.

author avatar
Yandamuri

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!