Keerthi suresh: ఊపందుకుంటున్న కీర్తి సురేష్ ..ఇక కష్టమే అనుకుంటున్న సమయంలో వరుస ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తోంది..

Share

Keerthi suresh: తెలుగులో నేను శైలజ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది కీర్తి సురేశ్. ఈ సినిమాలో ఆమె నటనకి తెలుగు ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. దాంతో ఇక్కడ వరుసగా అవకాశాలు అందుకుంది. నాని సరసన నేను లోకల్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి సినిమాలు చేసింది. అయితే అజ్ఞాతవాసి సినిమా భారీ డిజాస్టర్ కావడంతో కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన మహానటి సినిమాలో నటించి అసాధారణమైన క్రేజ్ సంపాదించుకుంది.

keerthi-suresh-is getting crazy offers
keerthi-suresh-is getting crazy offers

ఈ సినిమా ఇటు తెలుగులో అటు తమిళంలో ప్రేక్షకులను, ఇండస్ట్రీ వర్గాలను ఎంతగానో ఆకట్టుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అవార్డులను దక్కించుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మహానటి సినిమా కీర్తి సురేశ్ కెరీర్‌లో మైల్ స్టోన్‌లాగా నిలిచిపోతుంది. అలాంటి సినిమా తర్వాత కీర్తి కొన్ని షాకింగ్ డెసిషన్ తీసుకోవడం కాస్త కెరీర్‌కి ఇబ్బందులు వచ్చాయి అని చెప్పాలి. మహానటి సినిమాతో వచ్చిన క్రేజ్‌ను దృష్ఠిలో పెట్టుకొని వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కమిటయి దెబ్బ తినింది.

Keerthi suresh: ఈ లుక్‌లో కీర్తి సురేశ్ చాలామందికి నచ్చలేదు.

మహానటి సినిమా కోసం కాస్త బొద్దుగా తయారైన కీర్తి సన్నబడాలని అందరూ సలహాలివ్వడం హెవీగా వర్కౌట్స్ చేసి మరీ బక్కపలచగా తయారైంది. ఈ లుక్‌లో కీర్తి సురేశ్ చాలా మందికి నచ్చలేదు. ఇక అదే సమయంలో ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పెంగ్విన్, మిస్ ఇండియా దారుణంగా ఫ్లాపయ్యాయి. ఈ రెండు సినిమాల దెబ్బకి మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖీ రిలీజ్ కూడా చేయలేదు. దాంతో ఆమెకి ఇక అవకాశాలు దక్కుతాయా అని మాట్లాడుకున్నారు. ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సర్కారు వారి పాట, నితిన్‌తో రంగ్ దే సినిమాలలో అవకాశాలు అందుకొని సర్ప్రైజ్ చేసింది.

అయితే రంగ్ దే సినిమా ఓ మోస్తారు హిట్ అని టాక్ వచ్చినప్పటికీ కీర్తికి అంతగా ప్రశంసలు దక్కలేదు. మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. కానీ ఇటీవల సర్కారు వారి పాట సినిమా నుంచి విడుదలైన టీజర్‌లో కీర్తి మెస్మరైజ్ చేసింది. దాంతో మళ్ళీ అందరూ ఆమె డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఒకవైపు కీర్తి యంగ్ హీరోలతో రొమాన్స్ చేయడానికి కొత్త సినిమాలు కమిటవుతూనే..మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరోలకి సిస్టర్‌గానూ నటించడానికి ఓకే చెబుతూ షాకిస్తోంది.

Keerthi suresh: ఇక కష్టం అనుకున్న వారికి బ్యాక్ టు బ్యాక్ కొత్త ప్రాజెక్ట్స్‌తో షాకులిస్తోంది కీర్తి సురేశ్.

రజనీకాంత్ నటిస్తున్న తమిళ, తెలుగు సినిమా అణ్ణాత్తలో ఆయనకి చెల్లిగా నటిస్తున్న కీర్తి ఈ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేసింది. అలాగే త్వరలో మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భోళా శంకర్ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానుంది. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న కీర్తి సురేశ్.. దసరా పండుగ సందర్భంగా నేచురల్ స్టార్ నానీ ప్రకటించిన కొత్త సినిమా దసరాలో మరోసారి నానీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు స్వయంగా ప్రకటించి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇక కష్టం అనుకున్న వారికి బ్యాక్ టు బ్యాక్ కొత్త ప్రాజెక్ట్స్‌తో షాకులిస్తోంది కీర్తి సురేశ్.


Share

Related posts

బ్రేకింగ్ : మోడీ నివాసంలో అత్యవసర క్యాబినెట్ భేటీ..! సరిహద్దు వద్ద భారత్-చైనా సైనికులు…

arun kanna

పూజా హెగ్డే, రష్మిక మందన్న కాదు కీర్తి సురేష్ ..ఇదే ఫిక్సవండి ..!

GRK

భర్త ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ చూసి మురిసిపోతున్న నిహారిక

Muraliak