Keerthi suresh: మరక్కార్ ఎఫెక్ట్..కీర్తి సురేశ్ సినిమా రిలీజ్ ఆగిపోయింది..

Share

Keerthi suresh: టాలీవుడ్‌లో సాలీడ్ హిట్ కోసం ఎంతో ఎదురుచూస్తుంది కీర్తి సురేశ్. గత ఏడాది నుంచి కీర్తి సురేశ్ నటించిన సినిమాలైతే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి గానీ, అవి హిట్ మాత్రం సాధించడం లేదు. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ గా వచ్చిన పెంగ్విన్, మిస్ ఇండియా, కమర్షియల్ సినిమాగా వచ్చిన నితిన్ రంగ్ దే సినిమాలు కీర్తిని బాగా నిరాశపరచాయి. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అణ్ణాత్త సినిమాలో ఆయనకు చెల్లిగా నటించింది. తమిళంలో అజిత్ కుమార్‌కు వరుసగా మాస్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు శివ రూపొందించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని అందరూ అనుకున్నారు.

keerthi-suresh-movie release is stopped

కానీ అణ్ణాత్త సినిమా కూడా హిట్ సినిమాల లిస్ట్‌లో చేరలేకపోయింది. దాంతో కీర్తి ఖాతాలో మరో ఫ్లాప్ సినిమా వచ్చి పడింది తప్ప ఆమెకు కలిసొచ్చిందేమీ లేదు. దాంతో ఆమె మలయాళంలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా మరక్కార్ మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది. మలయాళంలో భారీ హిట్ అవుతుందనుకున్న మరక్కార్ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలింది. మోహన్ లాల్ నటించిన ఈ సినిమా ఏరకంగాను ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో మలయాళ ఇండస్ట్రీలోనూ కీర్తికి చుక్కెదురైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే గనక ఈనెల 10న కీర్తి నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖి రిలీజ్ కావాల్సింది.

Keerthi suresh: అసలు ‘గుడ్ లక్ సఖి’ సినిమాను రిలీజ్ చేస్తారా..!

ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. ఆది పినిశెట్టి, జగపతిబాబు, రమాప్రభ కీలకమైన పాత్రలను పోషించారు. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. గత ఏడాది నుంచి ఇప్పుడు అప్పుడు అని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చిన గుడ్ లక్ సఖి ఎట్టకేలకు ఈనెల 10న రిలీజ్ అని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఈ సినిమాను మళ్ళీ డిసెంబర్ 31న రిలీజ్ చేస్తామని కొత్త పోస్టర్‌ను వదిలి చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. దాంతో అందరూ మరక్కార్ సినిమా ప్రభావం వల్లే గుడ్ లక్ సఖి సినిమాను పోస్ట్‌పోన్ చేసి ఉంటారని మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు అసలు ఈ సినిమాను రిలీజ్ చేస్తారా..! అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

33 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

5 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago