అల్లు అర్జున్ ని కూడా లాగేసిన కీర్తి సురేష్.. నిజంగా మహానటి ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా 5 భాషల్లో భారీ పాన్ ఇండియన్ సినిమాగా తయారవుతుండగా నవంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందన్న నటిస్తుండగా రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.

Fans decode Allu Arjun's Pushpa posters and discover hints | Telugu Movie News - Times of India

కాగా ఈ సినిమా తర్వాత సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. అంతేకాదు 2022 లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే వెల్లడించారు. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

Allu Arjun announces new project with director Koratala Siva; film slated for early 2022 release - Entertainment News , Firstpost

అల్లు అర్జున్ ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ అయితే బావుంటుందన్న అభిప్రాయాన్ని తెలిపినట్టు సమాచారం. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి సినిమా చేసింది. అలాగే టాలీవుడ్ లో వరసగా స్టార్ హీరోల సినిమాలు అంగీకరిస్తుంది. ఇప్పటికే యంగ్ హీరో నితిన్ కి జంటగా రంగ్ దే సినిమా చేస్తుండగా త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాటలో హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా కీర్తి సురేష్ ని తన సినిమాలో నటింపచేయాలని భావిస్తుండటం గొప్ప విషయం అని చెప్పాలి. ఇక త్వరలో కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా సినిమా ప్రముఖ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఇక గుడ్ లక్ సఖీ, అన్నాత్తే సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.