Keerthy Suresh: ‘మహానటి’ సినిమాలో అలనాటి అందాల నటి సావిత్రి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్నన పొంది స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సినిమాలో కీర్తి సురేష్ తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ హీరో నితిన్ సరసన ‘రంగ్‌దే’ సినిమా లో నటిస్తోంది. తాజాగా కీర్తి లవ్ లో ఉందనే వార్తలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.
కీర్తి సురేష్ ఎవరి ప్రేమలో ఉంది అనే విషయమై ఆమె అభిమానులు ఒకింత ఉత్కంఠతతో ఉన్నారనే చెప్పాలి. కీర్తి సురేష్ కోలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ప్రేమలో ఉన్నట్లు సినీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అలాగే వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వార్తల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ అభిమానులు మాత్రం త్వరలోనే వీరు తమ పెళ్లికి సంబంధించిన వార్తను కచ్చితంగా వెల్లడిస్తారని అంటున్నారు.
ఇక కీర్తి సురేష్ మరియు అనిరుద్ ల ప్రేమ గురించి తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వీరి వివాహ తేదీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియాలంటే వేచి చుడాలిసిందే….
కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉందనే చెప్పాలి. స్టార్ హీరోస్ సరసన నటిస్తూ స్టార్ డం ను సొంతం చేసుకుంది. ఆమె తెలుగులో నితిన్ ‘రంగ్ దే’ సినిమాతో పాటుగా దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ లక్ సఖి లో కూడా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.