Keerthi suresh: మహానటి సినిమా తర్వాత కీర్తి సురేశ్ క్రేజ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో విపరీతంగా పెరిగింది. దాంతో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కమిటయింది. కానీ వాటిలో ఎక్కువగా ఉన్నది ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కావడం..అవి వరుసగా వచ్చి ఫ్లాపవడం కీర్తికి బాగా మైనస్ అయింది. ఆ తర్వాత చేసిన కమర్షియల్ సినిమాలు కీర్తి సురేశ్‌కి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. నితిన్ చేసిన రంగ్ దే బావుందనే టాక్ వచ్చిన కీర్తి అకౌంట్లో అది హిట్ సినిమాగా చేరలేకపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అణ్ణాత్తా సినిమాలోనూ కీర్తి ఓ కీలకమైన పాత్రలో కనిపించింది.
ఈ సినిమా సక్సెస్ కూడా ఏరేంజ్‌లో వచ్చిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కీర్తికి ఓ భారీ హిట్ కావాలి. అందుకే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో నటిస్తున్న సర్కారు వారి పాట మీద బాగా నమ్మకాలు పెట్టుకుంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 1న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ భోళా శంకర్ సినిమాలోనూ కీర్తి ఆయనకు చెల్లిగా కనిపించబోతోంది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన కీర్తికి ఎంత వరకు క్రేజ్ దక్కుతుందో చెప్పలేము.
Keerthi suresh: కీర్తి సురేశ్ ఈ సినిమాలో హీరోయిన్గా చేయడం లేదని అఫీషియల్‌గా అనౌన్స్
అయితే గతకొన్ని రోజులుగా ఓ భారీ పాన్ ఇండియన్ సినిమాలో కీర్తి సురేశ్ నటిస్తుందనే వార్తలు వచ్చాయి. అదే తెలుగులో తమిళ స్టార్ హీరో విజయ్ ఎంట్రీ ఇస్తున్న స్ట్రైట్ సినిమా. ఇది విజయ్ కెరీర్లో 66వ ప్రాజెక్ట్. దీనికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేశ్‌ను హీరోయిన్గా ఎంచుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం కీర్తి సురేశ్ ఈ సినిమాలో హీరోయిన్గా చేయడం లేదని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దాంతో కీర్తి అకౌంట్ నుంచి భారీ ప్రాజెక్ట్ మిస్ అయిందని చెప్పుకుంటున్నారు.