NewsOrbit
న్యూస్

వివాదాస్పదమైన కేరళ ప్రభుత్వ జాబితా !

తిరువనంతపురం,(కేరళ): కేరళ ప్రభుత్వం శబరిమల ఆలయంలోకి 51 మంది మహిళలు ప్రవేశించారని సుప్రీ కోర్టులో సమర్పించిన నివేదిక వివాదాస్పదంగా మారింది. కోర్టు సమర్పించిన పేర్ల జాబితాలో 42 ఏళ్ల మహిళ తమిళనాడుకు చెందిన (పురుషుడు) వ్యక్తిగా గుర్తించినట్లు ఎన్డిటివి కధనంలో పేర్కొంది.
అన్ని వయస్సుల వారు శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చని సుప్రీం తీర్పు ఇచ్చింది.
సుప్రీం తీర్పు అమలు చేస్తున్నామని పేర్కొంటున్న కేరళ ప్రభుత్వం, ఇద్దరు మహిళలు కాదు 51మంది మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించి, స్వామి దర్శనం చేసుకున్నట్లు సుప్రీంకు మహిళల జాబితాను అందజేసింది.
ఈ జాబితా ప్రకారం ఆయా మహిళల వివరాలను ఎన్డిటివి విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం పేర్కొన్నట్లుగా కొందరు మహిళల వయస్సు ధృవీకరణ తేదీలు తేడాగా ఉన్నట్లు వెలుగుచూశాయి. ఆధార్, ఓటరు కార్డుల్లో పలు తప్పులు దొర్లినట్లు గుర్తించారు.
ఆలయంలోకి ప్రవేశించినట్లు చెబుతున్న జాబితాలో 42 ఏళ్ల మహిళగా పేర్కొన్న ‘దైవసిగామణి’ (మణి) ఒక వ్యక్తి గా ఎన్డిటివి గుర్తించింది.
తమిళనాడుకు చెందిన చండిరా అనే మహిళ వయస్సు జాబితాలో 48ఏళ్లుగా ఉండగా, అమె ఓటరు కార్డులో 63ఏళ్ల వయస్సు నమోదై ఉంది.
ఆంధ్రప్రదేశ్కు చెందిన పద్మావతి అనే మహిళ వయస్సును 48గా చూపించగా, ఆమె తన వయస్సు 55 ఏళ్లు అని తెలిపింది.
శబరిమల ఆలయ తంత్రి కుటుంబ సభ్యుడు రాహుల్ ఈశ్వరన్ జాబితాలో ఉన్నటువంటి మహిళలను పిలిచి అడగ్గా 50ఏళ్ళకు పైబడినవారేనని చెప్పారని తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చి కేరళ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కేరళ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు పిఎస్ శ్రీధరన్ పిళ్లై కేరళ ప్రభుత్వ జాబితా అతిపెద్ద అబద్ధం అని అన్నారు.
పండలం రాజ కుటుంబ సభ్యుడు నారాయణ వర్మ ప్రభుత్వ వాదనలను వ్యతిరేకించారు.

author avatar
Siva Prasad

Related posts

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Leave a Comment