వర్షకు కెవ్వు కార్తీక్ ఐలవ్యూ చెప్పాడని.. స్టేజ్ మీదనే ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి?

జబర్దస్త్ లో ఇమ్మాన్యుయేల్, వర్ష జంటకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సుడిగాలి సుధీర్, రష్మీకి ఉన్న క్రేజ్ కన్నా.. వీళ్లిద్దరికి ఇప్పుడు ఎక్కువ క్రేజ్ ఉంది. ఇద్దరూ కలిసి స్టేజ్ మీదికి వస్తే చాలు.. స్టేజ్ మొత్తం ఈలలు.. గోలలు.. బుల్లి తెరను ఈ జంట ప్రస్తుతం ఏలేస్తోంది. అందుకే ప్రతి స్కిట్ లో ఇమ్మాన్యుయేల్ ను, వర్షను తీసుకోవాలని అందరూ తెగ ఆరాటపడుతున్నారు.

kevvu karthik proposes varsha in extra jabardasth skit
kevvu karthik proposes varsha in extra jabardasth skit

ఇమ్మాన్యుయేల్, వర్ష జంట ఆన్ స్క్రీన్ మీద సూపర్ గా సెట్ అయింది. అందుకే కెవ్వు కార్తీక్ టీమ్ లో వీళ్లిద్దరూ పర్మినెంట్ అయిపోయారు. అయితే.. ఇప్పటి వరకు వచ్చిన స్కిట్లలో వాళ్లిద్దరు లవర్స్ గా యాక్ట్ చేశారు. కానీ.. తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు.

ఎందుకంటే.. వర్షకు కెవ్వు కార్తీక్ స్కిట్ లో భాగంగా ఐలవ్యూ చెబుతాడు. అది స్కిట్ అయినప్పటికీ.. ఇమ్మాన్యుయేల్ జీర్ణించుకోలేకపోతాడు. మరోవైపు వర్షకు నాన్నగా ఈ స్కిట్ లో ఇమ్మాన్యుయేల్ నటించాడు. ప్రతి దానికి వర్ష నాన్నా.. నాన్నా.. అంటూ ఇమ్మాన్యుయేల్ ను అనేసరికి ఇమ్మాన్యుయేల్ కు చిరాకువచ్చి.. స్కిట్ నుంచి బయటకు వచ్చి ముందు డైలాగ్ చెప్పు.. ప్రతిదానికి నాన్నా.. నాన్నా అంటూ అరవకు.. అంటూ అనేసరికి స్టేజ్ మీద ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

మొత్తానికి ఈ వారం రచ్చ రచ్చే ఉంటుంది కాబోలు. ప్రస్తుతానికైతే ఈ ప్రోమో చూసేయండి.