NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Union Cabinet: కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు .. గ్యాస్ సిలెండర్ సబ్సిడీ పెంపు, తెలంగాణ హామీలకు గ్రీన్ సిగ్నల్

Share

Union Cabinet: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ అంశాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠూకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ.200ల రాయితీని రూ.300 చేసింది. ప్రస్తుతం 14.2 కేజీల గ్యాస్ సిలెంటర్ ధర రూ.903కాగా, ఉజ్వల యోజన వినియోగదారులకు రూ.703 చెల్లిస్తున్నారు. తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో కేవలం రూ.603 చెల్లించనున్నారు. తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రూ.889 కోట్లతో సమ్మక్క, సారక్క పేరిట ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పసుపు బోర్డు వల్ల దేశంలో పసుపుపై అవగాహన తో పాటు ఉత్పత్తి పెరుగుదల, కొత్త మార్కెట్ల ఏర్పాటు, విదేశాలకు ఎగుమతులు పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం రూ.1,600 కోట్ల పసుపును విదేశాలకు ఎగుమతి చేస్తున్నామనీ, దానిని రూ.8,400 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ బోర్డు చైర్మన్ ను కేంద్రం నియమిస్తుందని.. ఆయుష్, ఔషద, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల శాఖలు సభ్యులుగా ఉంటాయని, మూడు రాష్ట్రాల ప్రతినిధులు రోటేషన్ పద్ధతిలో సభ్యులుగా కొనసాగుతారని తెలిపారు. పసుపుపై పరిశోధనలు చేసే సంస్థలు, రైతులు, ఎగుమతిదారులు, వాణిజ్య శాఖ నియమించే కార్యదర్శి సభ్యుడిగా ఉంటారని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ కేంద్రం తీర్మానం ఆమోదించింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య వాటాను తేల్చాలని కృష్ణా ట్రైబ్యునల్ కు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. కొత్త నిబంధనలు రూపొందించి తమ వాటాను తెల్చాలని తెలంగాణ కోరుతోందని వివరించారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జలాల పంపిణీ చేయాలన్నారు. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ఆకాంక్ష నేరవేరుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Nara Lokesh: ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ కు ఊరట .. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణను వాయిదా వేసిన హైకోర్టు


Share

Related posts

శ్వేతసౌధంలో తెలంగాణ బిడ్డ వినయ్‌రెడ్డి కి అరుదైన గుర్తింపు

somaraju sharma

బిగ్ బాస్ 4: ఇప్పటివరకు సాగిన అన్ని సీజన్లలో కెల్లా ఈ సీజన్ బిగ్ బాస్ లో హిస్టరీ క్రియేట్ చేసిన అభిజిత్..??

sekhar

Parvati Nair Independence Day Photos

Gallery Desk