NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కీల‌క టైం కేటీఆర్ ఎస్కేప్‌… టీఆర్ఎస్‌లో ఏం జ‌రుగుతోంది…!

కీల‌క స‌మ‌యంలో కేటీఆర్ త‌ప్పించుకున్నారా? ఇదీ.. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో సాగుతున్న చ‌ర్చ‌. ముఖ్యంగా బీఆర్ ఎస్ నాయ‌కులు కూడా ఇదే మాట అంటున్నారు. దీనికి కారణం.. సోమ‌వారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీలో అత్యంత కీల‌క‌మైన జ‌ల వివాదాలు, ప్రాజెక్టులు, ముఖ్యంగా కృష్ణాన‌దిపై చేప‌ట్టిన ప్రాజెక్టుల గురించే చ‌ర్చ సాగింది. ఈ చర్చ‌లో అధికార పార్టీ కాంగ్రెస్ త‌ర‌ఫున బ‌లంగా న‌లుగురు మాట్లాడారు.

వీరిలో సీఎం రేవంత్‌, మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే జూప‌ల్లి కృష్ణారా వు.. మంచి వాగ్ధాటి ప్ర‌ద‌ర్శించారు. వీరికి కౌంట‌ర్ ఇచ్చేందుకు ప‌దేప‌దే బీఆర్ ఎస్ త‌ర‌ఫున మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు ఒక్క‌రే క‌నిపించారు. వాస్త‌వానికి సోమ‌వారం నాటి షెడ్యూల్‌ను అన్ని పార్టీల ఎమ్మెల్యేల‌కు అసెంబ్లీ పంపించింది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటులో నీళ్లు కూడా కీల‌క అంశం. త‌మ నాళ్ల‌ను ఉమ్మ‌డి పాల‌కులు ఏపీకి త‌ర‌లించేసి.. తెలంగాణ‌ను ఎడారి చేశార‌న్న నినాదం ఉద్య‌మ స‌మ‌యంలో జోరుగా వినిపించింది.

అలాంటి కీల‌క అంశాన్ని తొలిసారి కాంగ్రెస్ హ‌యాంలో చ‌ర్చ‌గా చేప‌ట్టిన క్ర‌మంలో స‌భ‌కు రావాల్సిన మాజీ సీఎం, విప‌క్ష నాయ‌కుడు కేసీఆర్ డుమ్మా కొట్టారు. పోనీ.. ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ అయినా.. వ‌స్తార‌ని అంద‌రూ ఎదురు చూశారు. కానీ, ఆయ‌న కూడా రాలేదు. దీంతో కాంగ్రెస్ నేత‌ల నుంచి శ‌ర‌ప‌రంప‌ర‌గా వ‌చ్చిన విమ‌ర్శ‌ల బాణాల‌ను ఒక్క హ‌రీష్‌రావే ఎదుర్కొని.. స‌మాధానం చెప్పాల్సి వ‌చ్చింది. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేసినా, బీఆర్ ఎస్ పాల‌న‌పై విమ‌ర్శుల చేసినా.. చివ‌ర‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ను చ‌ర్చల్లోకి లాక్కొచ్చినా.. హ‌రీష్ రావే స‌మాధానం చెప్పారు.

అయితే.. ఇంత పెద్ద చ‌ర్చ‌లో కేటీఆర్ పాల్గొన‌క‌పోవ‌డంపై ఇటు అధికార పార్టీ.. అటు బీఆర్ ఎస్ నాయ‌కుల్లోనూ చ‌ర్చ జ‌రిగింది. ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగానే స‌భ‌కు రాలేద‌నే టాక్ ఇరు ప‌క్షాల నుంచి వినిపించింది. పైగా.. స‌భ‌కు అంద‌నంత దూరంలో ఉండి.. ఆయ‌న ఏ ఇంపార్టెంట్‌(దీనికి మించి) ప‌ని పెట్టుకున్నార‌నే చ‌ర్చ కూడా మ‌ధ్య‌లో వ‌చ్చింది. చివ‌రికి.. హ‌రీష్‌రావును పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తి.. బాగా ప‌నిచేశారంటూ.. కేవ‌లం ఒక్క పొగ‌డ్త‌తో స‌రిపుచ్చారు. మ‌రి మున్ముందు.. కేటాయింపులు, బీఆర్ ఎస్ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధి , నిధులు, అప్పుల‌పై కూడా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. మ‌రి అప్పుడైనా.. కేటీఆర్ , కేసీఆర్‌లు స‌భ‌కు వ‌స్తారో రారో చూడాలి.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju