KGF 2 : కన్నడ సినిమా ఇండస్ట్రీలో రెండేళ్ల కిందట ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది. ఉపేంద్ర హీరోగా తెరకెక్కే కొన్ని సినిమాలు తప్పించి వారి సినిమాలకు పెద్దగా ఇతర భాషల్లో పాపులారిటీ ఉండదు. అవి వేరే భాషల్లో రిలీజ్ కావడమే గగనమయ్యేది. అలాంటిది ‘కేజిఎఫ్’ అనే చిత్రం భారతదేశం మొత్తం ప్రకంపనలు సృష్టించింది. దానికి ప్రధాన కారణం ఆ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన రాకింగ్ స్టార్ యశ్, అలాగే సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించిన వైవిధ్యం. ఇక కేజిఎఫ్ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఆ సినిమా రెండో భాగం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మధ్య విడుదలైన కేజిఎఫ్2 టీజర్ అయితే సినిమా అంచనాలను మరింత పెంచేసింది. అయితే పెరుగుతున్న ధరలతో పాటు నిర్మాతల ఆశలు కూడా భారీగా పెరిగి పోతున్నట్లు కనిపిస్తోంది. సినిమా మొదలు పెట్టే సమయానికి వారు వేసుకున్న అంచనాలను మించి ఇప్పుడు వారు ఎన్నో రెట్లు ఎక్కువ బిజినెస్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఏర్పడిన హైప్ ను వాడుకొని అనూహ్యమైన లాభాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బాహుబలి విషయంలో కూడా ఇలాగే జరిగింది. బాహుబలి మొదటి భాగం సూపర్ సక్సెస్ అయిన తర్వాత రెండో భాగం కోసం దేశవ్యాప్తంగా ఎదురుచూశారు. దీనికోసం బిజినెస్ బాగా జరిగింది.
కేజిఎఫ్ బడ్జెట్ బాహుబలి తో పోలిస్తే తక్కువ… అయితే హైప్ లో మాత్రం ఏ మాత్రం తక్కువ కాదు. అయితే ఇంత మంచి జరుగుతున్నప్పుడు సంతృప్తి చెందకుండా కేజిఎఫ్ నిర్మాతలు దురాశకు వెళ్తున్నారని అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కేజిఎఫ్ మేకర్స్ చెబుతున్న రేట్లు చూసి బయర్లు భయపడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు ఏకంగా 70 కోట్ల రేటు చెప్పినట్లు వార్తలు బయటకు వచ్చాయి. అంటే అది దాదాపు శంకర్ తీసిన అతి ఖరీదైన “2.o” రేటు. తెలుగులో స్టార్ హీరోల సినిమాలే ఇంత రేటు పలుకుతాయి.
అయితే కేజిఎఫ్ పైన భారీ అంచనాలు ఉన్నాయి కానీ మొదటి భాగం తో పోలిస్తే పదింతలు రేటు చెప్పడం మాత్రం అన్యాయం అని అంటున్నారు. ఇంకా ఓవర్సీస్ లో అయితే 80 కోట్ల వరకూ చెబుతున్నారట. బాహుబలి2 సినిమానే ఎంత రేటు పలకలేదు. ఇదంతా పక్కన పెడితే ప్రశాంత్ నీల్ మొదటిభాగం విడుదలకు ముందు రాజమౌళి ని కలిసిన తర్వాత అతను ఇచ్చిన కాంటాక్ట్స్ ద్వారా సినిమాని మరింత బాగా తీయగలిగారు… అన్ని భాషల్లోకి రాజమౌళి సహకారంతో ఎక్కువ థియేటర్లలో విడుదల చేయగలిగారు. మరి అటువంటి తెలుగు వర్షన్ కు ఇంత రేటు చెప్పడం అనేది ప్రశాంత్, యశ్ ల పరువు తీసినట్లే అవుతుంది కదా…?