KGF -2 release date : కేజిఎఫ్ మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ తో రెండో పార్ట్ ను మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.. అందుకే ఈ సినిమా లో అగ్ర భాషలకు చెందిన నటీనటులు నటిస్తున్నారు.. అధీరా పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు.. ప్రధానమంత్రి పాత్ర లో రవీనా టాండన్ పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తుంది.. రీసెంట్ గా విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. KGF -2 యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ఈరోజు సాయంత్రం 6:32 నిమిషాలకు జూలై 16 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు .. ఈ సందర్భంగా ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు.. మొత్తంగా RRR తర్వాత ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ KGF -2 నే..
దక్షిణాది నుంచి జాతీయస్థాయిలో బాహుబలి తర్వాత సత్తా చాటిన మరో సినిమా KGF.. ఈ సినిమాతో కన్నడ సినిమాల మార్కెట్ ను ఒక్కసారిగా ఆకాశాన్ని అందుకుంది.. కన్నడ ఇండస్ట్రీ టెక్నికల్ గా ఉన్నత స్థాయిలో ఉండదన్న అపవాద చెరిపేసింది.KGF ను అత్యుత్తమ నిర్మాణ విలువలతో కూడిన సినిమా ను భారత సినీ ప్రేమికులకు శాండిల్వుడ్ నిర్మాతలు అందించారు. ఈ సినిమాతో యశ్ హీరో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో రాఖీ బాయ్ పోషించిన పాత్ర ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడిని అలరించింది.
కే జి ఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ .. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీ లో మాత్రమే స్టార్ హీరో గా ఉన్న కే KGF సినిమాతో యశ్ నేషనల్ వైడ్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.. ఈ చిత్రం సృష్టించిన సంచలనాలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది .. ఈ సినిమా కన్నడ లో తొలి రూ. 230 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.. అంతేకాదు హిందీలో సుమారు రూ. 50 కోట్లకు పైగా కొల్లగొట్టింది. తెలుగులో కే జి ఎఫ్ తొలి భాగాన్నిని రూ.4 కోట్లకు తీసుకుంటే రూ.13 కోట్ల షేర్ తీసుకొచ్చింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!