కెజిఎఫ్ ఛాప్టర్ 1..ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనూహ్యంగా సంచలన విజయం అందుకుంది. భారీ కమర్షియల్ హిట్ గా నిలిచి కన్నడ హీరో యష్ తో పాటు ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ని ఓవర్ నైట్ స్టార్స్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ప్రముఖ సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో వచ్చిన ఈ సినిమా రిలీజైన అన్ని భాషల్లో వసూళ్ళ సునామీని సృష్ఠించింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ నిర్మించాలని మేకర్స్ రెడీ అయ్యారు.
కెజిఎఫ్ ఛాప్టర్ 2 అంటూ సీక్వెల్ ని రూపొందిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కాని కరోనా లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా చిత్రీకరణ దశలోనే ఆగిపోయింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాకి ఇంకా 15రోజుల టాకీ పార్ట్ చిత్రీకరణ జరపాల్సి ఉందని సమాచారం.
త్వరలోనే మిగిలిన టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో కెజిఎఫ్ 2 రిలీజ్ డేట్ కూడా మారినట్లు తాజా తెలుస్తుంది. వాస్తవంగా కెజిఎఫ్2 ని అక్టోబర్ 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలనుకున్నప్పటికి ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల దృష్ఠ్యా కెజిఎఫ్ 2 ని 2021 సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ విడుదల అయినప్పటి నుండి రాకీభాయ్ ను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అధీర లుక్ ను తాజాగా విడుదల చేసిన చిత్ర యూనిట్ హీరో యశ్ లుక్ ను విడుదల చేయాల్సి ఉంది. అధిరా లుక్ దేశవ్యాప్తంగా ఎంతో హైప్ క్రియేట్ చేసింది. కాగా రాకీ లుక్ అధిరా కంటే పదిరెట్లు పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. అంతేకాదు యశ్ ఈ సినిమా కోసం తన శరీరాన్ని ఉక్కు బాడిలా మార్చుకున్నారని అంటున్నారు. కేజీ ఎఫ్ చాప్టర్ 2 కి సంబంధించిన పోస్టర్ విడుదల తర్వాత యశ్ ఎంత డెడికేటెడ్ గా ఈ సినిమాకి పని చేశారో తెలుస్తోంది అని చెబుతున్నారు. దాంతో అభిమానులు, ప్రేక్షకులు రాకీ లుక్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.