న్యూస్ సినిమా

ప్రభాస్ “సలార్” గురించి లేటెస్ట్ అప్ డేట్ చెప్పిన కేజిఎఫ్ డైరెక్టర్..!!

Share

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో “కేజిఎఫ్” సినిమాతో తన దమ్మేంటో చూపించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం రెండో భాగం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యాష్ పుట్టినరోజు సందర్భంగా “కేజిఎఫ్-2” ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యి.. వరల్డ్ వైడ్ గా రికార్డులు సృష్టించడం జరిగింది. దీంతో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెరిగాయి.

Director Prashanth Neel to move to Tollywood? | Kannada Movie News - Times  of Indiaఇలాంటి తరుణంలో ప్రశాంత్ నీల్ .. ఇండియన్ బాహుబలి ప్రభాస్ తో “సలార్” ప్రాజెక్టు ప్రకటించడం సెన్సేషనల్ అయింది. హీరోని మాస్ ఎలివేషన్ లో చూపించడంలో స్పెషలిస్ట్ డైరెక్టర్ గా పేరొందిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ని స్క్రీన్ పై ఎలా చూపిస్తాడో అని ఊహల లోకంలో మునిగిపోయారు ఆయన అభిమానులు.

 

సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల ఫినిష్ అయ్యాయి. మరోపక్క ఈ సినిమా కోసం ప్రభాస్ భారీ స్థాయిలో వర్క్ అవుట్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్ అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా ఉన్న సంగతి తెలిసిందే. మాఫియా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నటు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో మాఫియా డాన్ పాత్రను ప్రభాస్ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా రీమేక్ అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో వస్తున్న వార్తలకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పూలుస్టాప్ పెట్టడం జరిగింది. ‘ఈ సినిమా ఏ సినిమాకు రీమేక్ కాదని అలాగే కేజీఎఫ్ సినిమా స్క్రిప్ట్ రాసే సమయంలో ఈ స్టోరీ రాసుకున్నట్టు క్లారిటీ ఇచ్చాడు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : బిగ్ బాస్ గుట్టు ఒక్కొక్కటిగా బయటపెడుతున్న సుజాత..! వాళ్ళే నాకలా చేయమని చెప్పారు

Teja

Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎఫ్ సీసీఐఎల్ లో 1074 ఖాళీలు..!!

bharani jella

మీది ఏపీనా? ముందు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar