ఖైదీ సినిమాతో సంచలనం సృష్టించాడు దర్శకుడు లోకేష్ కానగరాజ్. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా సంచలనమే. కార్తీ పెర్ఫార్మన్స్ తో పాటు లోకేష్ కథ, దర్శకత్వ ప్రతిభ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. ఈ చిత్రమే లోకేష్ కు ఏకంగా విజయ్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని కల్పించింది.
విజయ్ హీరోగా లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తారని ముందు వార్తలు వచ్చినా కానీ అది నిజం కాదని తెలిసిపోయింది. మాస్టర్ థియేటర్స్ లోనే విడుదలవుతుంది. ఇక లోకేష్ తన తర్వాతి చిత్రం గురించి వివరాలు తెలియజేసాడు. కమల్ హాసన్ ను లోకేష్ కానగరాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. కమలే ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అనిరుధ్ సంగీత దర్శకుడు.