NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS : గులాబీ నేతల కనుసన్నల్లో ఖాకీలు!పెచ్చుమీరిన రాజకీయ పెత్తనం!!

TRS : తెలంగాణ రాష్ట్రంలో పోలీస్​ డిపార్ట్​మెంట్​ను మినిస్టర్లు, టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు శాసిస్తున్నారు. ఎస్​ఐ నుంచి డీఎస్పీ దాకా.. పోలీసు ఆఫీసర్లకు ఎక్కడ  పోస్టింగ్​ ఇవ్వాలన్నా, ఎక్కడికి ట్రాన్స్​ఫర్​ కావాలన్నా ఎమ్మెల్యేల రికమండేషన్​ లెటర్  కంపల్సరీ అనే రూల్​ అనధికారికంగా అమలవుతోంది. ఐపీఎస్​లు మినహా అన్ని ర్యాంకుల పోలీసు ఆఫీసర్లు ఎమ్మెల్యేల ముందు క్యూ కట్టాల్సి వస్తోంది. ఏ పోలీస్​ ఆఫీసర్​ ఏ పోలీస్​ స్టేషన్​లో కొనసాగాలో కూడా లీడర్లే డిసైడ్​ చేస్తున్నారు.

Khakis in the shadows of TRS leaders! Excessive political power !!
Khakis in the shadows of TRS leaders! Excessive political power !!

తమతో మంచిగా ఉండేవాళ్లను తమ నియోజకవర్గ పరిధిలోని స్టేషన్లలో తెచ్చిపెట్టుకుంటున్నారు. లీడర్ల చేతుల్లోనే రిమోట్​ ఉండటంతో వారికి అనుకూలంగానే పోలీసులు పనిచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బుధవారం పెద్దపల్లి జిల్లాలో జరిగిన లాయర్​ దంపతుల హత్య విషయంలోనూ ఇలానే వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. తమకు ప్రాణభయం ఉందని లాయర్ దంపతులు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, పోలీసులు రక్షణ కల్పించకపోవటం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే కారణమని ప్రతిపక్షాలు అంటున్నాయి.

TRS : పోస్టింగ్ కావాలంటే రెకమెండేషన్ ఉండాల్సిందే

రాష్ట్రంలో ఆరేండ్లుగా అన్ని పోలీస్​స్టేషన్లలో రాజకీయ జోక్యం పెచ్చుమీరింది. కొందరు మినిస్టర్లు, అధికార పార్టీ ఎమ్మెల్యేలే పోలీస్​ బాస్​లుగా మారిపోయారు.  తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో మెరిట్​ ఆధారంగా పోలీసు పోస్టింగ్​లు ఉండేవి. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే, మినిస్టర్​ లెటర్​ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని కొందరు పోలీసులు అంటున్నారు. ఇందుకోసం లీడర్లు అడిగినంత తాము ఇచ్చుకోవాల్సి వస్తోందని చెప్తున్నారు. ఏరియాను బట్టి పోస్టింగ్​లకు ఎమ్మెల్యేలు రూ. లక్షల్లో రేట్లు ఫిక్స్​ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అలా పోస్టింగ్​ తీసుకోవడంతో లీడర్లు చెప్పిన పనులు, పైరవీలన్నీ చక్కదిద్దాల్సి వస్తోందని, వాళ్ల చెప్పు చేతల్లోనే కేసులు బుక్​ చేయాల్సి వస్తోందని,  వాళ్లు కోరి నట్లుగానే  కేసులు మాఫీ చేయాల్సి వస్తోందని కొందరు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట వినని వారిని హెడ్​ క్వార్టర్​లో, లూప్​ లైన్​ పోస్టుల్లో అటాచ్​ చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. మరోవైపు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం వల్లే కమిషనర్​ స్థాయి ఆఫీసర్లు కూడా చాలాకాలంగా ఒకే చోట కొనసాగుతున్నారు.

అఖిలప్రియ కేసులో అంత ఇంట్రస్ట్ అందుకే!

రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొందరు పోలీస్​ ఆఫీసర్లు అనవసర వివాదాల్లో తలదూరుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల హఫీజ్​పేట భూములు, కిడ్నాప్​ వ్యవహారంలో ఇదే జరిగింది. ఏపీకి చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు విషయంలో పోలీసుల పాత్ర వివాదాస్పదమైంది. టీఆర్​ఎస్ నేతల అనుచరులు, బంధువులకు ప్రమేయముందనే కారణంగానే పోలీసులు ఈ కిడ్నాప్​ కేసులో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనికి తోడు హైదరాబాద్​  చుట్టూ సివిల్​ కేసుల్లో పోలీసులు తలదూర్చటం వెనుక లీడర్లే చక్రం తిప్పుతున్నట్లు అభియోగాలున్నాయి.పొలిటికల్​ పోస్టింగ్​లు కావటంతో కొందరు పోలీస్​ ఆఫీసర్లు అధికార పార్టీ నేతల మెప్పు కోసం.. ప్రతిపక్షాల ఆందోళనలపై రెచ్చిపోతున్నారు.  ఆర్టీసీ సమ్మె టైంలో పోలీస్​ టీమ్​ కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ను గల్లా పట్టి గుంజి.. అనుచితంగా వ్యవహరించటం రాజకీయంగా చిచ్చు రేపింది. దుబ్బాక ఎన్నికల టైమ్​లో సిద్దిపేటలో నేతల ఇండ్లలో సోదాలు చేయటం, బీజేపీ నేతల విషయంలో ఓవర్​ యాక్షన్​ చేయడం ఈసీ జోక్యం చేసుకునేంత వరకు వెళ్లింది. జనగామలో మున్సిపల్​ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగిన బీజేపీ నేతలను స్థానిక సీఐ చావబాదిన ఘటన దుమారం లేపింది. ఇటీవల మీర్​పేటలో ఒక దళిత యువకుడిపై రౌడీషీట్  ఓపెన్​ చేయటం వెనుక కమిషనర్​ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.సాధారణంగా అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరించటం సహజమే కానీ తెలంగాణలో ఇది అవధులు దాటినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

author avatar
Yandamuri

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!