Khiladi : ఓ సినిమా మొదలై ఏ ఇతర కారణాలతోనైనా చిన్న బ్రేక్ వస్తే సోషల్ మీడియాలో ఎన్ని రకాల గాసిప్స్ క్రియేట్ అవ్వాలో అన్ని రకాల గాసిప్స్ వచ్చేస్తాయి. అంతేకాదు ఈ గాసిప్స్ చూసి జనాలు కూడా నమ్మేసి ..వాళ్ళ వర్షన్లో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేస్తారు. అలాంటి నెగిటివ్ టాక్ ఈ మధ్య మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమా విషయంలో వచ్చి వైరల్ అవడంతో పాటు హాట్ టాపిక్ గానూ మారాయి. క్రాక్ సినిమా తర్వాత వెంటనే ఖిలాడి సినిమాను మొదలు పెట్టాడు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పెన్ స్టూడియోస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండగా, ఆయనకి జోడీగా హాట్ బ్యూటీస్ డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సీనియర్ స్టార్ అర్జున్ తో పాటు, బుల్లితెర యాంకర్, కం నటి అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేశాడు రవితేజ. ఇక రీసెంట్ గా తన కొత్త సినిమాను ప్రకటించడంతో పాటు షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఇందులో మజిలీ ఫేం దివ్యాన్ష కౌశిక్ తో పాటు మలయాళ బ్యూటీ కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Khiladi : రూమర్స్ మాత్రమేనని ఖిలాడి బృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది.
అయితే ఈ సినిమా షూటింగ్ మొదలవగానే ఖిలాడి సినిమా అనుకున్న సమయానికి కంప్లీట్ కాకపోవడంతో రవితేజ ఇచ్చిన డేట్స్ అయిపోయి అదనంగా డేట్స్ ఇవ్వాలంటే మేకర్స్ అదనంగా తనకి రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు దాంతో మేకర్స్ తో డిఫ్రెన్సెస్ వచ్చినట్టు అందుకే ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ ఇవన్ని కేవలం రూమర్స్ మాత్రమేనని ఖిలాడి బృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈనెల 26న నుంచి షూటింగ్ మొదలవనున్నట్టు ఓ సాలీడ్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించింది. దాంతో మేకర్స్ రూమర్స్ కి చెక్ పెట్టినట్టైంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!