Kiara Advani: ప్రస్తుతం అటు బాలీవుడ్ తో పాటు దక్షిణాది లో కూడ వరుస హిట్ సినిమాలలో టాప్ హీరోస్ సరసన నటిస్తూ టాప్ హీరోయిన్ గా నిలిచింది కియారా అద్వానీ Kiara Advani. ‘MS ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ’ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మకు ఏకంగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘భారత్ అనే నేను’ లో హీరోయిన్ గా నటించే ఆఫర్ లభించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. కియారా ఫోటోలు నెట్ ఇంట్లో చక్కర్లు కొడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ ఇంటి దగ్గర కనిపించడంతో అక్కడ ఉన్నవారు ఫోటోలు తీశారు.

ఇప్పటికే ఈమెకు ఇండస్ట్రీలో మంచి పధ్ధతి గల హీరోయిన్ గా గుర్తింపు లభించింది. కానీ ఈ బ్యూటీకి అప్పుడప్పుడు పర్సనల్ లైఫ్ లో మాత్రం లవ్ ఎఫైర్స్ రూపంలో కొన్ని ట్రోలింగ్స్ ఎదురవుతున్నాయి. కీయరా అద్వానీ మరియు బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా గత కొద్దీ కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో రూమర్స్ ఉన్నాయి. కానీ ఎన్ని రూమర్స్ వచ్చినా కీయరా అద్వానీ మాత్రం వాటిపై ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు.
ఇటీవల ఈమె బాంద్రాలోని సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటి దగ్గర కనిపించడంతో అభిమానులు వెంటనే ఆమెను ఫోటోలు తీశారు. తన ప్రియుడి ఇంటికి వెళ్లిన ఈ స్టార్ హీరోయిన్ ప్రియుడితో కలిసి భోజనం చేసి వచ్చిందట. అంతేకాకుండా త్వరలోనే అనగా ఈ ఏడాదిలోనే వీరి వివాహం ఉండవచ్చని బాలీవుడ్ లో రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి…