NewsOrbit
న్యూస్

పిల్లలు సాఫ్ట్ సాఫ్ట్.. గా బహుమతులు కొట్టేయండి..!

 

వేగంగా అభివృద్ధి చెందుతున్నటెక్ యుగంలో దీటుగా నేటి యువత సిద్ధమైతేనే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటారు. అలా సిద్ధం చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ” టీసిఎస్ అయాన్ ఇంటిలిజెమ్” మూడోసారి జాతీయ స్థాయి పోటీ పరీక్షకు ప్రకటనను విడుదల చేసింది. రేపటి సవాళ్లను ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశం. ఆసక్తి ,అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

విద్యార్థులు స్కూల్ స్థాయి నుంచే సాంకేతిక పరిజ్ఞానం పై పట్టు సాధిస్తే భవిష్యత్తులో ఉద్యోగానికి ఢోకా ఉండదు. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) అందుకు తగిన ఆసరా అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ దశాబ్దపు యువత ఇప్పటి నుంచే నైపుణ్యాలు సాధించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రోత్సహిస్తుంది. ఈ పరీక్షలు టీసిఎస్ దాని అనుబంధ సంస్థలు టిసిఎస్ అయాన్, ప్రముఖ గ్లోబల్ సర్వీసెస్ ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థల భాగస్వామ్యంతో ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

దరఖాస్తు ఇలా :
ఈ పరీక్షలు పోటీ పడేందుకు అభ్యర్థులు తమ ప్రవర్తన, ప్రతిభ, నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు టిసిఎస్ ఇంటిలిజెమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 21వ శతాబ్ది నైపుణ్యాలను ఐదు విభాగాలుగా అభివృద్ధి చేసింది. అవి సమాచార నైపుణ్యాలు (కమ్యూనికేషన్ స్కిల్స్), సృజనాత్మకత అండ్ ఆవిష్కరణ (క్రియేటివిటీ ఇన్నోవేషన్), సార్వత్రిక విలువలు (యూనివర్సల్ వాల్యూస్), ప్రపంచ పౌరసత్వం (గ్లోబల్ సిటిజన్ షిప్), ఆర్థిక అక్షరాస్యత (ఫైనాన్షియల్ లిటరసీ). విద్యార్థులు దరఖాస్తు చేసుకునేటపుడు ఈ ఐదు విభాగాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంశాలను ఎన్నుకోవచ్చు.

ఏదైనా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఐదు నుంచి 9వ తరగతి చదువుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా పాఠశాల యాజమాన్యం సంబంధిత వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకొని ఒక ఐడి ని క్రియేట్ చేసుకోవాలి. దీనిని విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో నమోదు చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 21, 2020. నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

 

 

ఎంపిక విధానం :
ఈ పోటీ పరీక్షలు ఎంపికను మూడు దశల్లో నిర్వహిస్తారు. ఆన్లైన్ క్వాలిఫైయింగ్ రౌండ్, ఫ్రీ ఫైనల్ రౌండ్ లు, జాతీయ స్థాయి గ్రాండ్ ఫైనల్స్. మొదటిదశలో 2 ఆన్లైన్ ఆన్లైన్ అసెస్మెంట్ లు ఉంటాయి. విద్యార్థి ఎంచుకున్న అంశంపై ఉన్న అవగాహన, జ్ఞానాన్ని బేరీజు వేస్తారు. ఈ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. క్వాలిఫైయింగ్ రౌండ్ తరువాత, ప్రతి గ్రేడ్-టాపిక్ నుంచి మెరిట్ విద్యార్థులకు తీసుకొని ఫ్రీ ఫైనల్ రౌండ్ లో నిపుణుల బృందం ద్వారా ఆడియో, విజువల్ , కార్యాచరణ ఆధారిత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల పనితీరును అంచనా వేసి మూడో రౌండ్ ఎంపిక చేస్తారు. ఇక చివరి రౌండ్ ముఖా ముఖి నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని విజేతలుగా నిర్ణయిస్తారు. 5,6 తరగతి విద్యార్థులను జూనియర్ విజేతలుగా. 7,8,9 తరగతుల వారిని సీనియర్లు విజేతలుగా విభజించి వారికి నగదు బహుమతులు, ట్రోఫీలు, పతకాలు, ధ్రువ పత్రాలతో పాటు కొత్తరకం గ్యాడ్జెట్స్ కూడా అందజేస్తారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సంబంధిత పాఠశాలలకు స్కూల్ అవార్డుతోపాటు ఏక్సలెన్సు అవార్డుతోపాటు జాతీయస్థాయి గుర్తింపు దక్కుతుంది. ఈ పోటీలకు అవసరమైనా మెటీరియల్ ను ఆన్లైన్లో అందుబాటు ఉంటుంది. వాటిని అధ్యయనం చేసి విద్యార్థులు పోటీలో పాల్గొనవచ్చు. పజిల్స్, డిజిటల్ బుక్ లెట్స్, ఆటలు వాటిలో పాల్గొని వినోదాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. అంతేకాకుండా పరిశ్రమ అనుభవజ్ఞులతో అనుసంధానం కావచ్చు. వారిద్వారా నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవచ్చు. వీటిలో అభ్యర్థులు నేర్చుకున్న నైపుణ్యాలు, వారి పరిజ్ఞానం, అవగాహన, లకు సంబంధించి నివేదిక రూపంలో వ్యక్తిగత ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.

ఎప్పటికప్పుడు భవిష్యత్ తరానికి సంబంధించిన నైపుణ్యాల కోసం కృషి చేస్తూనే ఉంటాం. కంటెంట్ ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ పరీక్షను ఇంటిలిజెమ్ ప్రోగ్రాం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని గురించి ఇటీవల విడుదల చేసిన జాతీయ విద్యా విధానం లోనూ పేర్కొన్నారు. ఇది విద్యార్థుల విభిన్న అంశాలను గుర్తించి, ప్రపంచీకరణ, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ యుగంతో పోటీ పడేందుకు ఇలాంటివి ఎంతగానో దోహదపడతాయి.

వెబ్ సైట్: http://intelligem.tcsion.com/

author avatar
bharani jella

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N