ట్రెండింగ్ న్యూస్

King Nagarjuna : యాంకర్ శ్యామలకు గన్ పట్టుకోవడం ఎలాగో నేర్పించిన కింగ్ నాగార్జున?

king nagarjuna in start music show
Share

King Nagarjuna : కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మన్మథుడు ఆయన. 60 ఏళ్లు వచ్చినా.. ఇంకా యువకుడిలాగానే ఉంటూ యువతుల మదిని దోచేస్తున్న నవ మన్మథుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున.

king nagarjuna in start music show
king nagarjuna in start music show

ఆయన కొడుకులు కూడా ఆయన కన్నా పెద్ద వయసులా కనిపిస్తారు కానీ.. నాగ్ మాత్రం రోజురోజుకూ యువకుడిలా మారిపోతున్నారు. అదే ఆయనకు బలం కావచ్చు. ఇండస్ట్రీలో ఇంకా నాగార్జునకు అవకాశాలు వస్తున్నాయంటే దానికి కారణం ఆయన ఫిట్ నెస్.

ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి త్వరలోనే సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాల్గొంటోంది టీమ్.

ఈ సినిమాలో బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అలీ రెజా కూడా మంచి రోల్ ప్లే చేశాడు. వీళ్లంతా కలిసి స్టార్ మాలో వచ్చే స్టార్ట్ మ్యూజిక్ షోలో సందడి చేశారు.

King Nagarjuna : స్టార్ట్ మ్యూజిక్ షోలో సందడి చేసిన నాగ్

అయితే… స్టార్ట్ మ్యూజిక్ షోకు వచ్చిన వైల్డ్ డాగ్ టీమ్ తెగ సందడి చేసింది. వైల్డ్ డాగ్ సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఆ తర్వాత నాగ్.. గన్స్ ఎలా వాడాలో అక్కడికి వచ్చిన వాళ్లకు నేర్పించారు. యాంకర్ శ్యామలకు కూడా గన్ ఎలా పట్టుకోవాలో నేర్పించారు.

దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను తాజాగా స్టార్ మా విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమోపై ఓ లుక్కేయండి మరి.


Share

Related posts

అమిత్ షా తో కేసీఆర్ స‌మావేశం…. బీజేపీతో రహ‌స్య ఒప్పందం?

sridhar

Eatela Rajendar: ఈట‌ల చేసిన ఒకే ఒక త‌ప్పు… ఎన్ని మాట‌లు ప‌డేలా చేస్తోందంటే…

sridhar

కాల్పుల్లో ఆల్ బదర్ కమాండర్ మృతి

Siva Prasad