King Nagarjuna: పడుచు హీరోయిన్‌తో లిప్‌లాక్‌లు.. ముసలి వయసులోనూ తగ్గేదే లే అంటున్న నాగార్జున..!

Share

Tollywood King: టాలీవుడ్ కింగ్, నటసామ్రాట్ అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) 62 ఏళ్ల వయసులోనూ నవమన్మధుడిగా వెండితెరపై దడదడ లాడించేస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన, మన్మధుడు 2 చిత్రాలతో ఆయన రొమాంటిక్ ఆడియన్స్ ని ఎలా ఎంటర్‌టైన్‌ చేశారో చెప్పాల్సిన పనిలేదు. మన్మధుడు 2 చిత్రంలోని ఘాటైన రొమాన్స్ ఒక వర్గానికి నచ్చినా.. మిగతా వర్గాలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ఘాటైన విమర్శలు చేశారు. ఈ సినిమా కూడా అంతగా ఆడలేదు. దాంతో నాగార్జున విక్టరీ వెంకటేష్, అమితాబ్ బచ్చన్ లాగా మంచి కంటెంట్ (content orientated) ఉన్న సినిమాలు చేసి హిట్స్ కొట్టడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చందమామ కథలు, పీఎస్వీ గరుడ వేగా ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) తో కలిసి కోసం ఘోస్ట్ (Ghost movie) సినిమాకి ఒప్పుకున్నారు. ఈ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో హల్చల్ చేస్తుంది.

 

వయసు పైబడినా పడుచు హీరోయిన్‌తో లిప్‌లాక్‌లు

నాగార్జునకు జంటగా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసుకోవాలని దర్శకుడు ప్రవీణ్ సత్తారు భావించారు. కానీ కాజల్ అగర్వాల్ మ్యారేజ్ లైఫ్ తో బిజీ కావడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో మలయాళ బ్యూటీ అమలాపాల్(Amala Paul)ను నాగార్జున సరసన హీరోయిన్ గా తీసుకున్నారు. ఇన్‌సైడ్‌ టాక్ ప్రకారం, ఈ సినిమాలో నాగార్జున కోసం ప్రవీణ్ సత్తారు ఘాటైన రొమాంటిక్, లిప్‌లాక్(Liplock) సన్నివేశాలను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అమలాపాల్ నాగార్జునతో కలిసి మోస్ట్ ఇంటెన్స్ లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడానికి భారీ ఎత్తున రెమ్యునరేషన్ పుచ్చుకున్నట్లు వినికిడి. నిజానికి అమలాపాల్ వయసు 30 ఏళ్లే.. నాగార్జున ఆమె కంటే 32 ఏళ్లు పెద్దవారు. దీనితో పడుచు హీరోయిన్‌తో ఈ లిప్‌లాక్‌లు ఏంటి నాగార్జునా? అని ప్రేక్షకుల నుంచి విమర్శలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది.

 

పాత్ర డిమాండ్ చేస్తే తగ్గేదే లే

ఇప్పటికే ఒకసారి మన్మధుడు 2 సినిమాలో యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో హద్దులు దాటి మరీ రొమాన్స్ చేశారు నాగార్జున. కానీ ఆ రొమాన్స్ మెజారిటీ అఫ్ ది ఆడియన్స్ కు ఎబ్బెట్టుగా అనిపించింది. గత అనుభవం దృష్టిలో ఉంచుకొని నాగార్జున ఈ సన్నివేశాలను వద్దంటారా? లేదా పాత్ర డిమాండ్ చేస్తే తగ్గేదే లే అంటూ రెచ్చిపోతారా? అనేది తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో నాగార్జున కుమారుడు అఖిల్ పవర్‌ఫుల్ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నాడని రూమర్స్ వచ్చాయి. భరత్, సౌరభ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Share

Related posts

Pawan kalyan : పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ మళ్ళీ మారింది.. కాని అదిరిపోయింది ..!

GRK

NTR : తమిళ్ టాప్ డైరెక్టర్ తో సలార్ కి ధీటుగా సినిమా ఓకే చేసిన జూనియర్ ఎన్‌టి‌ఆర్… !

Teja

ఫోన్ ట్యాపింగ్ కేసు : వైసీపీ నీ జగన్ నీ ఇరకాటం లో పెట్టే కొత్త కీలక సాక్ష్యం ? 

sekhar