కిరాక్ ఆర్పీ ఇంద్రభవనం లాంటి ఇల్లు వెనుక అసలు నిజమిది..!!

Share

ప్రస్తుతం చిన్నా, పెద్దా తేడా లేకుండా సెలబ్రిటీలందరూ హోమ్ టూర్స్‌ చేసి యూట్యూబ్‌లో పెడుతున్నారు. ఆ వీడియోలకు వచ్చిన మిలియన్ల కొద్ది వ్యూస్‌తో తెగ డబ్బు సంపాదిస్తున్నారు. ఇటీవల జబర్దస్త్ కమిడియన్ కిర్రాక్ ఆర్పీ కూడా ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లును తనదిగా చెబుతూ హోమ్ టూర్ చేశాడు. ఆ వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయగా.. దానికి ఏకంగా 32 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కిర్రాక్ ఆర్పీ హోమ్ టూర్ వీడియో అంతలా వ్యూస్ ఎందుకు రాబట్టిందంటే ఆ ఇల్లు పెద్దగా ఉంది. అందులో ఖరీదైన వస్తువులు, లగ్జరీ కిచెన్, ఇంట్లోనే లిఫ్ట్, స్టడీ హాలు, మినీ హోమ్ థియేటర్ వంటి ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఇల్లు కట్టించడానికి కనీసం రూ.5 కోట్ల అవుతాయని నెటిజన్లు కూడా అనుకున్నారు. వీడియో మొదలు చివరి వరకూ ఇల్లు నాదే అని చెప్పడంతో నిజంగానే ఇది ఆర్పీ ఇళ్లా? అని చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. జబర్దస్త్‌లో కమెడియన్‌గా చేసి ఇంత పెద్ద ఇల్లు కట్టడం అసాధ్యమని అనుకున్నారు. కానీ చివరికి నమ్మేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇల్లు గురించి జబర్దస్త్ ఫేమ్ షేకింగ్ శేషు సంచలన కామెంట్స్‌ చేశాడు.

అన్నీ అబద్ధాలే..

రీసెంట్ టైమ్స్‌లో జబర్దస్త్ షో, మల్లెమాల ప్రొడక్షన్స్‌పై ఆర్పీ విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. బూతులు తిడుతూ ఆరోపణలు చేస్తూ ఆర్పీ రెచ్చిపోతున్నాడు. అయితే ఆర్పీకి కౌంటర్‌గా షేకింగ్ శేషు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేషు మాట్లాడుతూ.. “ఆర్పీ చెప్పేవన్నీ అబద్ధాలే… తన ఇల్లు అని చెప్పుకున్న లగ్జరీ ఇల్లు అసలు తనది కాదు. ఇంద్ర భవనంలా కనిపిస్తున్న ఆ ఇల్లు వాస్తవానికి ఒక ఇంటిరియర్ డిజైనర్ ఇల్లు. ఆ ఇల్లు చూపిస్తూ ఆర్పీ గాడు ఇది నా ఇల్లు, ఇది నా బెడ్ రూమ్, ఇది మా అన్నయ్య బెడ్ రూమ్ అంటూ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు. ఆ వీడియో చూసినవాళ్లందరు నిజమే అని నమ్మారు…”

ఆర్పీ పెద్ద ఫ్రాడ్

“ఎవరిదాకానో ఎందుకు ఆ వీడియో చూసి మా ఆవిడ కూడా నన్ను తిట్టింది. ఆర్పీని చూసి నేర్చుకోండి, చూడు అతడెంత పెద్ద భవనం కట్టాడో!! వెళ్లి వాడి చంక నాకు అని తిట్టింది. కానీ ఆర్పీ అంత పెద్ద ఇల్లు కట్టించాడంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. అందుకే ఆరా తీశా. అప్పుడు ఆర్పీ చెప్పిందంతా వట్టి అబద్ధం తెలిసింది. అది కోటీశ్వరుల ఇళ్లకు ఇంటీరియర్ డిజైనింగ్ చేసే ఒక వ్యక్తిది తెలిసింది.” అని ఆర్పీ బండారం మొత్తం బయటపెట్టాడు శేషు. హోమ్ టూర్ వీడియో పేరుతో డబ్బు సొమ్ము చేసుకొని జనాలని పిచ్చివాళ్లని చేయాలని ఆర్పీ చూసాడు కానీ చివరికి వాడే ఓ పిచ్చివాడయ్యాడని శేషు అన్నాడు. ఈ నిజం తెలిసిన నెటిజనులు ఆర్పీని తిట్టిపోస్తున్నారు. “జనాల్ని పిచ్చి వాళ్లని చేయాలనుకుంటే నువ్వే పిచ్చోడివి అయిపోతావ్, నువ్వొక దొంగ, ఫ్రాడ్” అంటూ పచ్చిగా తిడుతున్నారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

44 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

2 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

4 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago