Kirthi suresh: హీరోయిన్ కీర్తి సురేష్ కి సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణాది సినిమా రంగంలో అనేక ఇండస్ట్రీలలో టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన “సర్కారు వారి పాట” సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే సినిమాపరంగా కీర్తి సురేష్ కి మంచి గుర్తింపు మహానటి సినిమా ద్వారా లభించింది.
జాతీయ అవార్డు కూడా కీర్తి సురేష్ మహానటి సినిమాకు అందుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు హిందీలో ఒక సినిమా కూడా చేయని కీర్తి సురేష్ ఇటీవల ఓ సెన్సేషనల్ రికార్డు సృష్టించింది. విషయంలోకి వెళితే కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా సినిమా.. హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్లో రిలీజ్ అయ్యి.. 24 గంటల్లో 17 మిలియన్ల వ్యూస్ సాధించటం మాత్రమే కాక..575కే లైకులు 16కే కామెంట్స్.. యూట్యూబ్లో రాబట్టుకుంది. సౌత్ ఇండియాలో ఏ హీరోయిన్ కి దక్కని మొదటి సినిమాకే కీర్తి సురేష్ కి.. ఈ రికార్డు దక్కడం విశేషం.
Read more: Mahesh babu: విశాఖపట్టణంలో ఫుల్ బిజీ కాబోతున్న మహేష్ బాబు..!!
వెస్ట్ ఇండియా సినిమాలో కీర్తి సురేష్ చేసిన పాత్ర.. హిందీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. సినిమాకి హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాహుబలి సినిమా వచ్చాక చాలావరకు నార్త్ ఇండియా మూవీ లవర్స్ దక్షిణాది సినిమాలపై మనసు పారేసుకున్నారు. సౌత్ ఇండియాలో హిట్ పడితే చాలు .. ఆ సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీ లో రీమేక్ చేయడం కోసం టాప్ హీరోలు సైతం పోటీ పడుతున్న పరిస్థితి. ఇక ఇదే క్రమంలో యూట్యూబ్ లో కూడా దక్షిణాది సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది.