దైవం న్యూస్

Krishnarpanam : కృష్ణర్పణం అని పెద్దవాళ్లు అనడం వెనుక ఉన్న రహస్యం తెలిస్తే.. మీరు అనకుండా ఉండలేరు !!  !!

Share

Krishnarpanam : మనం చూస్తూనే  ఉంటాం  చాల మంది ఏది చేస్తున్న ఏది తింటున్న కృష్ణార్పణం అంటూ ఉంటారు.  లేదా వారి ఇష్ట దైవం కి  అర్పిస్తుంటారు.  అస్సలు ఇలా చేయడానికి కారణమేమిటి? ఇలా చేయడం వలన దక్కే ఫలితమేమిటి అనేది తెలుసుకుందాం..
ఏదో ఒక కర్మ చేయకుండా ఏ ప్రాణీ  ఉండదు. ఆ విధం గా  మంచి పనులు  చేయడం వలన  కీర్తి, ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు  అందుతాయి.అదే చెడ్డ పనులు చేస్తే  సమాజం లో  చెడ్డపేరు రావడం తో పాటు  నరకయాతన, పాప ఫలాలు  అందుతాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గ నరకాలు   పొందటానికి   మళ్ళి , మళ్ళి  జన్మలు పొందుతూ..ఈ  జనన  మరణ సంసార చక్రంలో  చిక్కుకోవలిసిందేనా?ఈ చక్రం లో పడకుండా మార్గం ఉందా అని చాలామంది ఆలోచిస్తూనే ఉంటారు.

మనలో ఉన్న  ఈ విచారాన్ని పోగొట్టడానికి  శ్రీకృష్ణ భగవానుడు   గీతలో  చక్కని మార్గం  చెప్పారు.
అదేమంటే అర్జునా! నువ్వే పని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏమిచ్చినా, ఏ తపం చేసిన వచ్చిన  ఫలితాన్ని  నాకు సమర్పించు అని తెలియ చేసారు.  ఇలా  చేయడం వలన  మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది.
మొదటి  దాని  పేరు కర్తృత్వ త్యాగం. ఈ పని నేను చేస్తున్నాను లేదా  చేయిస్తున్న  అన్న అహంకారం వదలాలి. ఏ కర్మయినా  కూడా ఆ భగవంతుడు మనతో చేయిస్తున్నారని  భావన చేయాలి.  ఏది    చేసినా భగవత్ పరంగా భావించాలి. ఇలా  చేయడం వలన మనం పాపపు పనులు చేయడానికి  వెనుకాడతాము.  కర్మ కి సాక్షి గా ఉన్న  ఆ  భగవానుడిని  తలుచుకుంటూ  ఎప్పుడు మంచి పనులు చేస్తుంటారు.   ఇక రెండోది ఫల త్యాగం గా చెప్పబడింది. ఏ పని  చేసినా అది నా కర్తవ్యం అని భావించి  చెయ్యాలి. తప్ప    ఇది చేస్తే నాకు ఈ ఫలితం    వస్తుంది అని కోరిక తో  చేయకూడదు.  నేనేం చేసినా దాని ఫలం భగవానుడికి చెందుతుంది అని భావించాలి.

అన్నీ  పనులు భగవంతుడి సేవలో భాగాలే అని మరువకూడదు. ఇక ఆఖరుది మూడోది సంగత్యాగం గా చెప్పబడింది. ఇది నాది, ఇది నేను  మాత్రమే చెయ్యాలి. అంతా నా ఇష్టం ప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం  జరగాలి అని  లేనిపోని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్  కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా  భావించాలి.ఈ  మూడు  త్యాగాలు ఎలా చెయ్యాలి  అంటే ఏ పని  చేస్తున్నాకూడా ముందు  ఒక్క నమస్కారం పెట్టి, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు  అంటూ ఒక్క మాట  చెప్తే చాలు.


Share

Related posts

Mahesh Babu: ” రమేశ్ అన్నయ్యది ‘ఆ ఒక్క’ ఆఖరి కొరికా తీర్చలేకపోయాను ” కుమిలిపోతోన్న మహేశ్ బాబు!

bharani jella

Madhu Priya : వావ్ బంగారం లాంటి వీడియో – తన కొడుకుతో కలిసి పాట పాడిన మధు ప్రియ – లవ్లీ సీన్ డోంట్ మిస్

bharani jella

karthika deepam: మళ్ళీ సౌర్యకు అన్యాయం…నిరూపమ్, హిమ ప్రేమించుకుంటే సౌర్య పరిస్థితి ఏంటి..?

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar